జీ5లోకి “అలాంటి సిత్రాలు”..!

జీ5లోకి “అలాంటి సిత్రాలు”..!

Published on Sep 23, 2021 10:37 PM IST

జీ 5’ ఓటీటీ తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ.. ఇలా పలు భారతీయ భాషల్లో, వివిధ జానర్లలో ఎప్పటికప్పుడు సరికొత్త వెబ్‌ సిరీస్‌లు, డైరెక్ట్ డిజిటల్‌ రిలీజ్‌ మూవీస్‌తో పాటు కొత్త సినిమాలను వీక్షకులకు అందిస్తూ వినోదాన్ని పంచుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ‘అలాంటి సిత్రాలు’ కూడా జీ5 లోకి వచ్చింది.

శ్వేతా పరాశర్, యాష్ పురి, అజయ్ కతుర్వార్, ప్రవీణ్ యండమూరి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “అలాంటి సిత్రాలు”. సోషల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈతరం యువత ఆలోచన, ఆందోళలన నుంచి సమాజంలో జరిగే పలు వాస్తవ అంశాలను ప్రతిబింబించేలా రూపొందించారు. ఈ సినిమా సెప్టెంబర్ 24 నుండి ‘జీ 5’ ఓటీటీలో వీక్షకులకు అందుబాటులో ఉండనుంది. ఈ సందర్భంగా మీడియా మిత్రుల కోసం నేడు మధ్యాహ్నం ప్రత్యేకంగా సినిమాను ప్రదర్శించారు. అనంతరం చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడింది.

అయితే చిత్ర సమర్పకులు రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ “ఈ రోజు ‘జీ5’ లాంటి గొప్ప ఓటీటీ వేదిక మా సినిమాను విడుదల చేస్తుండటం మాకు చాలా సంతోషంగా ఉందని, జీ సంస్థకు చెందిన అనురాధ గారు, సాయి ప్రకాష్, నిమ్మకాయల ప్రసాద్ గారికి థాంక్స్ అన్నారు.

యష్ పూరి మాట్లాడుతూ సినిమాలో తాను రాగ్ పాత్రలో నటించానని, ఇంట్లో ఇంటీరియర్ కాంప్లెక్స్ గురించి ఫైట్ చేస్తూ సొంత మ్యూజిక్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించే ఓ యువకుడు. మంచి పాత్రలో నటించాను. ఇదొక డ్రీమ్ టీమ్. వీళ్ళతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉందని, నాకు అవకాశం ఇచ్చిన మా దర్శకుడు సుప్రీత్, సమర్పకులు రాఘవేంద్రరెడ్డి గారు, నిర్మాతలకు థాంక్స్ అని అన్నారు.

ప్రవీణ్ యండమూరి మాట్లాడుతూ “నేను సినిమా గురించి చెప్పడం కంటే ఈ రోజు సినిమా చూసిన మీడియా మిత్రులు చెబితే బావుంటుందని, వాళ్ళు రాసే, చెప్పే ప్రతి మాటకు నేను ఎంతో విలువ ఇస్తానని, ఇందులో నేను దిలీప్ అనే పాత్రలో నటించాను. గ్రే షేడ్ ఉన్న పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన మా దర్శకుడు సుప్రీత్ కి థాంక్స్. సినిమా విడుదల వరకూ వచ్చిందంటే, ఈ స్థాయిలో ఉందంటే రాఘవేంద్రరెడ్డి గారు, రాహుల్ రెడ్డి గారు ప్రధాన కారణం. మా సినిమాను విడుదల చేస్తున్న ‘జీ 5’కు థాంక్స్ అని అన్నారు.

అజయ్ కతుర్వార్ మాట్లాడుతూ “నేనొక బాక్సర్ పాత్రలో నటించానని, అతని వ్యక్తిగత-వృత్తిపరమైన జీవితాల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? అనేది సినిమాలో చూపించారు. నాకు, యామినికి మధ్య క్యూట్ లవ్ స్టోరీ ఉంది. టీజర్లు, ట్రైలర్లకు మంచి స్పందన లభించింది. ఇందులో చూపించినవన్నీ మంచి చిత్రాలే. మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన మా దర్శక, నిర్మాతలు, యూనిట్ సభ్యులకు థాంక్స్. ‘జీ 5’లో సినిమా విడుదల అవుతుందని అన్నారు.

తన్వి మాట్లాడుతూ నేను యామిని పాత్రలో నటించాను. సంప్రదాయ కుటుంబం నుండి వచ్చిన ఆమె ప్రేమలో ఎలా పడిందనేది ఆసక్తికరం. యష్, యామినికి మధ్య మంచి ప్రేమకథ ఉంది. మా కథతో పాటు సినిమాలో మరో మూడు ప్రేమకథలు ఉన్నాయని, ప్రేక్షకులందరూ ‘అలాంటి సిత్రాలు’ను ‘జీ 5’లో తప్పకుండా చూడాలమి అన్నారు.

దర్శకుడు సుప్రీత్ సి. కృష్ణ మాట్లాడుతూ ఈ సినిమా చూశాక ప్రేక్షకులు, విమర్శకులు క్రాఫ్ట్స్ గురించి మాట్లాడతారని అనుకుంటున్నానని, మా టెక్నికల్ టీమ్ లేకుండా ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. మా టీమ్ అందరికీ థాంక్స్. ప్రధాన తారాగణం అంతా అద్భుతంగా నటించారు. మేమంతా ఈ వేదికపై నిలబడ్డామంటే రాఘవేంద్ర రెడ్డిగారు కారణం. నాకు ఏ అవసరం వచ్చినా నిలబడిన రాహుల్ రెడ్డి అన్నకు థాంక్స్. ‘అలాంటి సిత్రాలు’ సినిమా గురించి చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ గురించి కంటే కంటెంట్ గురించి అందరూ మాట్లాడతారని అన్నారు.

ఇరవై మూడేళ్ల రాగ్‌ గాయకుడు, గిటారిస్ట్‌. అతడు తన కంటే వయసులో పెద్దదైన ఓ వ్యభిచారి పట్ల ఆకర్షితుడవుతాడు. ఆమె జీవితంలో కొట్లాట, గొడవలు మానేసి సాధారణ జీవితం గడపాలని ప్రయత్నిస్తున్న గ్యాంగ్‌స్టర్‌ దిలీప్‌ పాత్రేమిటి? బాక్సర్‌ కావాలని కలలు కనే యష్‌కు, ఈ ముగ్గురి కథకు సంబంధం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు