“మోసగాళ్లు” బిగ్గెస్ట్ స్కామ్ ను రివీల్ చేసిన బన్నీ.!

“మోసగాళ్లు” బిగ్గెస్ట్ స్కామ్ ను రివీల్ చేసిన బన్నీ.!

Published on Oct 3, 2020 9:22 AM IST

గత కొన్ని రోజుల నుంచి మంచి ఆసక్తి రేపుతున్న మంచు హీరో మంచు విష్ణు చిత్రం “మోసగాళ్లు” ప్రపంచంలో ఒక బిగ్గెస్ట్ స్కామ్ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో విష్ణు సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అయితే పోస్టర్స్ తోనే ఆకట్టుకున్న ఈ చిత్రం తాలూకా టీజర్ గ్లింప్స్ ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదల చేస్తామని ఇటీవలే ప్రకటించారు.

ఇపుడు చెప్పినట్టుగానే ఈరోజు ఉదయం ఈ టీజర్ ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేసి వారి టీం కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక టీజర్ విషయానికి వస్తే 2016లో జరిగిన ఈ 450 మిలియన్ డాలర్ల బిగ్గెస్ట్ స్కామ్ కోసం అగ్ర రాజ్య అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో అడ్రెస్ చేస్తున్న స్పీచ్ తో మొదలయ్యి ఆ భారీ మొత్తాన్ని దోచే జంటగా విష్ణు అండ్ కాజల్ నైస్ ఎండింగ్ ఇచ్చారు.

మొత్తం భారీ ఎత్తున డబ్బుల బస్తాల నడుమ “ఇది సరిపోతుందిగా అని కాజల్ అంటే ఆటిప్పుడే మొదలయ్యింది” అని విష్ణు ఈ గ్లింప్స్ ను ఎండ్ చేసాడు. మొత్తానికి అయితే మంచి ఆసక్తికరంగానే ఈ టీజర్ ఉంది. ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించగా సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ మరియు మళయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేయనున్నామని తెలుపుతున్నారు.

టీజర్ కోసం క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు