ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ ల ఆహా వారి ఒరిజినల్ సినిమా ”హైవే” …!

ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ ల ఆహా వారి ఒరిజినల్ సినిమా ”హైవే” …!

Published on Aug 6, 2022 5:13 PM IST

విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హైవే. ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా వారి ఒరిజినల్ మూవీగా తెరకెక్కిన హైవేలో ఆనంద్ తో పాటు అభిషేక్ బెనర్జీ కూడా కీలక రోల్ చేస్తున్నారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న హైవే కి కెవి గగన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ అయిన విష్ణు (ఆనంద్ దేవరకొండ) ఒకానొక సందర్భంలో తులసి (మానస) ప్రేమలో పడతాడు.

అయితే వారి ప్రేమకథలోకి డీ అనే సీరియల్ కిల్లర్ ప్రవేశించడం, ఆపైన కథ కొన్ని అనూహ్యా పరిణామాలకు దారితీయడం, ఆపై తులసిని ఆనంద్ ఏ విధంగా కాపాడుకుంటాడు అనే కథాంశంతో ఈ మూవీ సాగనుందట. ఇప్పటివరకు ఎవరూ చూపించని విధంగా ఎంతో గ్రిప్పింగ్ గా ఈ మూవీ స్క్రీన్ ప్లే ఉంటుందట. ఇక ఇటీవల కలర్ ఫోటో వంటి జాతీయ అవార్డు మూవీని మనకు అందించిన ఆహా వారు తప్పకుండా హైవే తో మరొక సక్సెస్ అందుకోవడం ఖాయం అంటోంది వారి టీమ్. త్వరలో ఈ మూవీ అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు