నమ్రత ఎంతో మంది మహిళలకు స్పూర్తిదాయకం – బండ్ల గణేష్

Published on Sep 23, 2020 2:03 am IST


బాలీవుడ్ డ్రగ్స్ వివాదం టాలీవుడ్ పరిశ్రమను కూడ తాకింది. కొన్నిరోజుల క్రితం స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు రావడంతో పెద్ద దుమారమే రేగింది. దీంతో ఆమె నేరుగా ఢిల్లీ వెళ్ళి తనపై మీడియాలో జరుగుతున్న అనాధారిత ప్రచారాన్ని నిలిపివేసేలా మీడియాకు ఆదేశాలివ్వాలని పిటిషన్ వేశారు. కోర్టు ఆమెకు అనుకూలంగానే తీర్పునిచ్చింది. ఇక తాజాగా స్టార్ హీరో మహేష్ బాబు సతీమణి, ఒకప్పటి నటి నమ్రత సిరోద్కర్ పేరు ప్రస్తావనకు రావడం కలకలం రేపింది.

ఇక జాతీయ మీడియా సంస్థ నార్కోటిక్స్ బ్యూరో అధికారుల విచారణలో దొరికిన వ్యక్తుల వాట్సాప్ చాట్ నందు నమ్రత పేరు ఉందనే సమాచారం వచ్చినట్టు కథనాలు వెలువరించింది. దీంతో మిగతా మీడియా మొత్తం ఇదే విషయాన్ని పెద్ద ఎత్తున క్యారీ చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా, అధికారిక కన్ఫర్మేషన్ లేకుండా మొదలైన ఈ గాలి వార్తలు క్షణాల్లో వైరల్ గా మారి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

మహేష బాబు అభిమానులే కాకుండా మిగతా ప్రేక్షకులు సైతం సోషల్ మీడియాలో ఈ అనాధారిత ఆరోపణలను, వార్తలను తీవ్రంగా ఖందించారు. తాజాగా ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష రియాక్ట్ అవుతూ ‘నమ్రత నాకు 15 ఏళ్లుగా తెలుసు. ఆమె ఎంతోమంది మహిళలకు స్పూర్తిదాయకమైన వ్యక్తి. ఆమె ఒక గొప్ప భార్య, గొప్ప తల్లి. ఆమెను నేను గౌరవిస్తాను’ అంటూ ట్వీట్ చేశారు.

సంబంధిత సమాచారం :

More