సమీక్ష : భానుమతి రామకృష్ణ – మెప్పించే భానుమతి రామకృష్ణల ప్రేమ గాథ

సమీక్ష : భానుమతి రామకృష్ణ – మెప్పించే భానుమతి రామకృష్ణల ప్రేమ గాథ

Published on Jul 3, 2020 1:58 PM IST
BhanumathiRamakrishna Review

Release date : జులై 3rd, 2020

123telugu.com Rating : 3.25/5

నటి నటులు : నవీన్ చంద్ర, సలోనీ లుథ్రా, రాజా చెంబోలు, హర్ష చేముడు

రచన,దర్శకత్వం : శ్రీకాంత్ నాగోతి

నిర్మాతలు : యస్వంత్ ములుకుట్ల

సంగీతం : శ్రావణ భరద్వాజ్

సినిమాటోగ్రఫీ : సాయి ప్రకాష్ యు

 

డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో విడుదల కానున్న మరొక చిత్రం భానుమతి రామకృష్ణ. నవీన్ చంద్ర, సలోని లూథ్రా జంటగా దర్శకుడు శ్రీకాంత్ నాగోతి తెరకెక్కించిన ఈ రొమాంటి లవ్ డ్రామా ఆహా లో జులై 3న విడుదల కానుంది. స్పెషల్ స్క్రీనింగ్ ద్వారా ఈ చిత్రాన్ని చూడడం జరిగింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం..

 

స్టోరీ:

 

భానుమతి ఓ ముఫై ఏళ్ల సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. తన జీవితంలో జరిగిన బ్రేక్ అప్ వలన ఈ ఇండిపెండెట్ లేడీ…లవ్, రిలేషన్ పట్ల అయోమయ స్థితిలో ఉంటుంది. అదే సమయంలో పల్లెటూరు బ్యాక్ గ్రౌండ్ కలిగిన రామకృష్ణ(నవీన్ చంద్ర) ట్రాన్ఫర్ పై హైదరాబాద్ లో భానుమతి చేసే కంపెనీలో ఆమెకు అసిస్టెంట్ గా జాయిన్ అవుతాడు. మొదట్లో రామకృష్ణను ఇష్టపడని భానుమతి క్రమేణా అంతని ప్రేమలో పడిపోతుంది. రెండు భిన్న నేపధ్యాలు, మనస్థత్వాలు కలిగిన ఈ ఇద్దరి ప్రేమ ప్రయాణం ఎలా సాగింది అనేది మొత్తంగా భానుమతి రామకృష్ణ మూవీ సారాంశం…

 

ప్లస్ పాయింట్స్:

ఓ ప్రేమ కథలో ప్రేక్షకుడిని ఇన్వాల్వ్ చేస్తూ ఫీల్ గుడ్ మూవీగా సాగే ఈ మూవీపై ఎక్కడా విసుగన్న భావన రాదు. ప్రధాన పాత్రల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు, సంభాషణలకు తోడు…కట్టిపడేసే కథనం మంచి అనుభూతిని పంచుతుంది. సున్నితమైన సన్నివేశాలకు బీజీమ్ మరింత ఆకర్షణ జోడించింది.

ఇండిపెండెంట్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ లేడీగా సలోని నటన చాలా సహజంగా ఉంది. శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్ లా ఆమె పాత్ర తీర్చిదిద్దగా ఆ పాత్రకు సలోని మంచి ఆకర్షణ తీసుకొచ్చారు. ఈ చిత్రం కూడా దాదాపు హీరోయిన్ ఎమోషన్స్, అభిరుచుల కోణంలో సాగుతుంది.

ఇక గ్రామీణ నేపథ్యం కలిగిన అమాయకపు సాఫ్ట్వేర్ ఎంప్లొయ్ గా నవీన్ చంద్ర నటన మెచ్చుకోవాల్సిందే. పాత్రకు తగ్గట్టుగా ఆయన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ వాస్తవికతకు అద్దం పట్టాయి. ఈ పాత్ర ద్వారా నవీన్ ఎటువంటి పాత్రనైనా తన మార్క్ నటనతో మెప్పించగలనని నిరూపించాడు.

ఇక హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలు చాలా సహజంగా సాగాయి. కమెడియన్ హర్ష ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయగా నేటి తరం యూత్ స్వభావాన్ని గుర్తు చేస్తుంది.

 

మైనస్ పాయింట్స్:

 

ఒకటిన్నర గంట నిడివి గలిగిన ఈ మూవీలో మరికొన్ని రొమాంటిక్ సన్నివేశాలు జోడించి నిడివి పెంచితే బాగుండన్న భావన కలుగుతుంది. పాత్రల మధ్య ఎమోషన్స్ పండినా కథలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ బలంగా లేదు.

ఇక హీరోయిన్ సెంట్రిక్ మూవీలా సాగే ఈకథలో దర్శకుడు ఎక్కువగా హీరోయిన్ పాత్రపైనే ఫోకస్ పెట్టి.. హీరో పాత్రను కొంచెం విస్మరించినట్లున్నాడు. ఈ పాయింట్ కూడా దర్శకుడు దృష్టిలో పెట్టుకొని ఉంటే…ముగింపు మరింత ఆకర్షణగా ఉండేది.

 

సాంకేతిక విభాగం:

 

పాటలు పర్వాలేదనట్లున్నా బీజీఎమ్ మాత్రం అద్బుతంగా కుదిరింది. ఉన్నత నిర్మాణ విలువలు కలిగిన ఈ చిత్రంలో కెమెరా వర్క్ మెప్పిస్తుంది. ఇక లోతైన అర్థంతో కూడా సున్నితమైన మాటలు బాగున్నాయి. ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది.

దర్శకుడు శ్రీకాంత్ నాగోతి గురించి చెప్పాలంటే… ఓ చిన్న కథను ఆసక్తికరంగా నడిపిన తీరు బాగుంది. ఆయన రాసుకున్న కథనం మరియు సన్నివేశాలు చాలా సహజంగా మనసుకు హత్తుకునేలా సాగాయి. కమర్షియల్ అంశాల కోసం…అవసరం లేని హంగులు జోడించ కూడా తెరకెక్కించి మెప్పించారు. హీరోయిన్ పాత్రతో పాటు హీరో పాత్రకు మరికొంత ప్రాధాన్యత…వారి పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్ జోడించి ఉంటే మరింత ఆకర్షణగా ఉండేది.

 

తీర్పు:

ఓ సింపుల్ కథలో ప్రధాన పాత్రల మధ్య సహజంగా అనిపించే సన్నివేశాలు…ఆకట్టుకొనే సంభాషణలతో భానుమతి రామకృష్ణ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇది ఎవరు ఎరుగని కథ కాకున్నప్పటికీ హీరో హీరోయిన్స్ నటన, అద్భుత సంగీతం మూవీకి మంచి ఆకర్షణ జోడించాయి. లాక్ డౌన్ సమయంలో ఆహ్లాదం పంచే ఈ భానుమతి రామకృష్ణ మూవీని తప్పక చూడండి .

123telugu.com Rating : 3.25/5
Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు