ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..!

Published on May 24, 2020 11:21 am IST

నటిగా అనేక సినిమాలలో నటించినా రాని ఫేమ్ బిగ్ బాస్ షో తో సొంతం చేసుకుంది వితికా షేరు. కింగ్ నాగార్జున హోస్ట్ గా గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ సీజన్ 3లో వితిక, భర్త వరుణ్ సందేష్ తో కలిసి పాల్గొంది. దాదాపు చివరి వరకు షో లో కొనసాగిన వితిక సక్సెస్ఫుల్ కంటెస్టెంట్ అని చెప్పొచ్చు. మొదటిసారి తెలుగులో కపుల్ కేటగిరికి అవకాశం ఇవ్వగా వీరిద్దరి పాల్గొన్నారు. షోలో వీరి మధ్య రొమాన్స్, ఎమోషన్స్, గొడవలు ప్రేక్షకులకు మంచి వినోదం పంచాయి. బిగ్ బాస్ షో వలన వచ్చిన ఫేమ్ ఈమె బాగానే ఉపయోగించుకుంటుంది.

కాగా సోషల్ మీడియాలో వితిక ఓ ఆసక్తికర వీడియో పంచుకుంది. మామిడితో తోటలో ఆమె సరదాగా గడిపిన ఓ వీడియో షేర్ చేశారు. ఇక ఈ బ్యూటీ స్వయంగా మామిడి చెట్టు ఎక్కి తన వెంట ఉన్న పిల్లలకు మామిడి కాయలు కోసిపెట్టారు. ఇలా మామిడి తోటలో కాయలు కోయడం చాలా సరదాగా ఉంటుంది కదా అని తన ఆనందం వ్యక్తపరిచింది. త్వరలోనే ఈ బిగ్ బాస్ కపుల్ మూవీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More