సైరాపై పోటీకి సై అంటున్న చాణక్య..!    

సైరాపై పోటీకి సై అంటున్న చాణక్య..!    

Published on Sep 21, 2019 11:04 PM IST

గోపీచంద్ హీరోగా మేహరీన్ కధానాయకగా తిరు దర్శకత్వంలో పీకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించిన చిత్రం చాణక్య. అయితే ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా ప్రేకషకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అంతేకాదు సినిమాలోని గొపీచంద్ సరికొత్త స్టయిల్, యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే ఈ సినిమాపై కూడా ప్రేక్షకులకి అంచనాలు పెరిగిపోయాయి.

అయితే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉన్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 5వ తేదిన రిలీజ్ చేయబోతున్నారన్న వార్త తెగ ప్రచారం అవుతుంది. అయితే మెగస్టార్ చిరు నటిస్తున్న సైరా సినిమా విడుదలైన మూడు రోజులకే ఈ చిత్రం కనుక విడుదల చేస్తే సైరా ధాటిని తట్టుకుని చాణక్య నిలబడగలదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఒకవేళ సైరాకి పోటీగా వెళితే అది నిజంగా సాహసమేనని, చాణక్య సినిమాపై మేకర్స్ కూడా పక్కా కాన్‌ఫిడెంట్‌గానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఒకవేళ ఈ సినిమ అక్టోబర్ 5వ తేదినే రిలీజ్ అయితే సైరాకి కాస్తంతయినా పోటీ ఇస్తుందా లేదా అనేదానిపై వేచి చూడాల్సిందే.          

సంబంధిత సమాచారం

తాజా వార్తలు