ఫాన్స్ కి ట్రీట్..సూపర్ స్టార్ మహేష్ కి పవన్ నుంచి స్పెషల్ విషెష్..!

ఫాన్స్ కి ట్రీట్..సూపర్ స్టార్ మహేష్ కి పవన్ నుంచి స్పెషల్ విషెష్..!

Published on Aug 9, 2022 3:37 PM IST


మన టాలీవుడ్ లో బిగ్గెస్ట్ రైవల్ ఏదన్నా ఉంది, ఒక సరైన మల్టీ స్టారర్ అంటే ఇది అనేలా ఎప్పుడు నుంచో ఉన్న అవైటెడ్ గా ఉన్న క్రేజీ మల్టీ స్టారర్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల కాంబో అని చెప్పాలి. ఈ ఇద్దరు బిగ్ స్టార్స్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎంత కొట్టుకున్నా ఇద్దరూ ఇద్దరే అని చెప్పాలి.

ఇక ఈ ఇద్దరూ ఏదైనా సందర్భంలో ఒక ఫ్రేమ్ లో కనిపించినా జస్ట్ ఏదైనా ఒకరిపై ఒకరు పోస్ట్ చేసినా అది సెన్సేషన్ అవుతుంది. మరి ఈరోజు అలాగే మహేష్ పై పవన్ విషెష్ చెబుతూ ఒక స్పెషల్ పోస్ట్ పెట్టడం జరిగింది దీనితో ఇది ఓ రేంజ్ లో సెన్సేషన్ గా మారింది.

” ప్రముఖ కథానాయకులు శ్రీ మహేష్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తనదైన శైలి నటనతో నవతరం ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఆయన చేపట్టి సేవా కార్యక్రమాలు… హృద్రోగంతో బాధపడే చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేయించడం అభినందనీయం. శ్రీ కృష్ణ గారి నట వారసత్వాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తూ.. తండ్రి బాటలోనే దర్శకులకు, నిర్మాతలకు అండగా నిలుస్తున్నారు. ‘అర్జున్’ సినిమా సందర్భంలో పైరసీపై పోరాటానికి శ్రీ మహేష్ బాబు గారు తన గళం వినిపిస్తే ఆయనకు మద్దతుగా నిలిచాను.

పరిశ్రమను కాపాడుకొనేందుకు ఆయన ముందుకు రావడంతో అందరం వెన్నంటి నిలిదాం. ‘జల్సా’ సినిమాలో సంజయ్ సాహూ పాత్రను పరిచయం చేసేందుకు శ్రీ మహేష్ బాబు గారి నేపథ్య గాత్రం అయితే బాగుంటుందని, దర్శకులు శ్రీ త్రివిక్రమ్ గారు కోరగానే అంగీకరించిన సహృదయత శ్రీ మహేష్ బాబు గారిది. కథానాయకుడిగా తనదైన పంధాలో వెళ్తూ ప్రేక్షకుల మెప్పు, పురస్కారాలూ అందుకొంటున్న శ్రీ మహేష్ బాబు గారు మరిన్ని విజయాలు అందుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.” అని పవన్ తెలిపాడు. దీనితో ఈ పోస్ట్ ఫ్యాన్స్ కి క్రేజీ ట్రీట్ ని ఇస్తూ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు