సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ నుండి క్రేజీ అప్ డేట్ …. !

సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ నుండి క్రేజీ అప్ డేట్ …. !

Published on Aug 9, 2022 5:08 PM IST


యువ నటుడు సుధీర్ బాబు హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. గతంలో ఇంద్రగంటి, సుధీర్ ల కాంబినేషనన్ లో వచ్చిన సమ్మోహనం, వి మూవీస్ రెండూ కూడా మంచి విజయం అందుకున్నాయి. ఇక ప్రస్తుతం ముచ్చటగా వీరిద్దరూ కలిసి చేస్తున్నఈ మూవీ పై అందరిలో బాగా అంచనాలు ఉన్నాయి.

ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోన్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి. రొమాంటిక్ యాక్షన్ తో కూడిన ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ యొక్క రిలీజ్ డేట్ ని రేపు ఉదయం 11 గం. 7 ని. లకు అనౌన్స్ చేయనున్నట్లు కొద్దిసేపటి క్రితం యూనిట్ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ప్రకటించింది. తొలిసారిగా కృతి, సుధీర్ కలిసి నటిస్తున్న ఈ మూవీ తప్పకుండా ఆకట్టుకుంటుందని, దర్శకడు ఇంద్రగంటి మూవీని ఎంతో బాగా తెరకెక్కించారని అంటోంది యూనిట్.

https://www.instagram.com/p/ChBvmVAJWuB/?igshid=YmMyMTA2M2Y=

సంబంధిత సమాచారం

తాజా వార్తలు