ఇంటర్వ్యూ : దేవి శ్రీ ప్రసాద్ – ప్రతి సినిమాకి నాకు ఓ భయం ఉంటుంది !

ఇంటర్వ్యూ : దేవి శ్రీ ప్రసాద్ – ప్రతి సినిమాకి నాకు ఓ భయం ఉంటుంది !

Published on Jan 10, 2020 3:46 PM IST

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని వరల్డ్‌ వైడ్‌ గా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కాగా ఈ సందర్భంగా దేవి శ్రీ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీ కోసం…

 

చాల సంవత్సరాల నుంచి ఎంతో బిజీబిజీగా సినిమాలు చేశారు. సూపర్ హిట్స్ కొట్టారు. ఇంకేం చేస్తాంలే అని ఎప్పుడూ అనిపించలేదా ?

నేను ప్రతి సినిమాని ఫస్ట్ సినిమాలనే ఫీల్ అవుతాను. ఫస్ట్ ఫిల్మ్ టైంలో ఓ భయం ఉంటుంది. ఆ భయం ఉన్నంత కాలం ఎన్ని సినిమాలు చేసినా ఆ ఫ్రెష్ నెస్ పోదు. ఓ సందర్భంలో కమల్ హాసన్ గారు చెప్పారు. ప్రతి సినిమా విషయంలో ఆ భయం అలాగే ఉంచు. ఆ భయమే మనల్ని కాపాడుతుందని. నేనూ అదే నమ్ముతాను.

 

మ్యూజిక్ కాకుండా మీకు దేని పై ఎక్కువ ఇంట్రస్ట్ ఉంటుంది. దేని పై ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు ?

నాకు ఫొటోగ్రఫీ అంటే బాగా ఇంట్రస్ట్ అండి. నేను ట్రావెలింగ్ లో ఖచ్చితంగా ఒక కెమెరాను తీసుకువెళ్తాను. బేసిగ్గా మా నాన్నగారికి ఫొటోగ్రఫీ అంటే బాగా ఇష్టం. ఆయన ఇండస్ట్రీకి వచ్చిందే కెమరామెన్ అవుదామని. కానీ అనుకోకుండా రైటర్ అయ్యారు. ఆయన ద్వారా నాకు కూడా ఫొటోగ్రఫీ మీద బాగా ఇష్టం పెరిగింది.

 

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో సంగీతం గురించి ?

నేను ఫస్ట్ టైం స్క్రిప్ట్ విన్నప్పుడే.. ఇది పూర్తి ఆల్బమ్ అని నాకు నమ్మకం వచ్చేసింది. మినిమమ్ రెండు డాన్స్ నెంబర్స్ వస్తాయి, అలాగే అన్ని రకాల జోనర్ సాంగ్స్ కి స్కోప్ ఉందనిపిచింది. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో అన్ని రకాల సాంగ్స్ బాగా కుదిరాయి. మహేష్ గారితో ఓ మాస్ సాంగ్ చేయాలని ఎప్పటినుండో ఓ కోరిక ఉండేది. అది కూడా ఈ సినిమాతో నెరవేరింది.

 

మహేష్ బాబుగారి గురించి ?

ఆయన సూపర్ స్టార్ అంటే కూడా.. గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఒకసారి డైరెక్టర్ నో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ను నమ్మాక.. ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరి వరకూ ఆ డైరెక్టర్ కి పూర్తి సపోర్ట్ చేసారు. నా విషయంలో కూడా చాల ఎంకరేజ్ చేశారు.

 

మహేష్ బాబుతో వరుసగా సినిమాలు చేస్తున్నారు. కంటిన్యూగా చేస్తోనప్పుడు మ్యూజిక్ ఒకేలా వచ్చే ప్రమాదం ఉండొచ్చు. ఆ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ?

ప్రతి సినిమా కథ వేరు, అలాగే ఆ కథానేపథ్యం వేరుగా ఉంటుంది. మ్యూజిక్ అనేది ఎప్పుడూ ఆ కథలోని ఎమోషన్ బట్టి.. మెయిన్ క్యారెక్టర్స్ పాయింటాఫ్ లో నుండి ఉంటుంది. సో.. ప్రతి సినిమాకి మ్యూజిక్… ఆ సినిమాని బట్టే ఉంటుంది.

 

మీరు హీరోగా సినిమా చేస్తున్నారనే వార్త చాల సంవత్సరాలుగా వినిపిస్తోంది. ఆ సినిమా ఎంతవరకూ వచ్చింది ?

సినిమా చేయమని అడుగుతున్నారు గాని, నాకు మ్యూజిక్ మీద ఉన్న ఇంట్రస్ట్ వల్లనేమో యాక్టింగ్ చేయాలనే ఆసక్తి రావడం లేదు. అయితే నాకు తమిళంలో ఎక్కువమంది కథలు చెబుతున్నారు. మ్యూజిక్ ప్రధానంగా సాగే కొత్త కథ ఉంటే ఏదైనా చెయ్యొచ్చు.

 

మీ తదుపరి సినిమాల గురించి ?

సుకుమార్ – అల్లు అర్జున్ సినిమా చేస్తున్నాను. మా కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఉంటుంది ఆ సినిమా. అలాగే ‘ఉప్పెన’ సినిమా చేస్తున్నాను. నితిన్ ‘రంగ్ దే’, అలాగే కీర్తి సురేష్ సినిమా కూడా చేస్తున్నాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు