ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : దృశిక చందర్ – థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాను !

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : దృశిక చందర్ – థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాను !

Published on Aug 24, 2020 3:59 PM IST

‘బుచ్చినాయుడు కండ్రిగ తూర్పు వీధి’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దృశిక చందర్. ఈ సినిమాకు పోలూరి కృష్ణ దర్శకత్వం వహించారు. శ్రీ సాయి పవర్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై పమిడిముక్కల చంద్రకుమారి ఈ చిత్రాన్ని నిర్మించారు. మున్నా – దృశిక చందర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఆహా ఓటీటీ యాప్ లో విడుదలఅయింది. కాగా దృశిక చందర్. ఈ చిత్రానికి సంబంధించిన అనేక విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆ విశేషాలు మీకోసం…

మీ ‘బుచ్చినాయుడు కండ్రిగ – తూర్పు వీధిలో..’ సినిమాకు స్పందన ఎలా ఉంది?

స్పష్టంగా చెప్పాలంటే స్పందన మిశ్రమంగానే ఉంది. కానీ నా నటన, మరియు నా పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రాన్ని ప్రేమిస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. నాకు సంతోషం కలిగించిన ఒక విషయం ఏమిటంటే, నా సినిమా చూడటానికి అనేక రకాల ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ సినిమాలో మీ పాత్ర పై మీ అభిప్రాయం ?

నా తొలి చిత్రంలోనే నేను ఒక విలేజ్ గర్ల్ పాత్రను పోషించాను, ఇప్పటివరకూ నా జీవితంలో నేను ఇంతకు మునుపు ఎన్నడూ ఏ గ్రామానికి వెళ్ళలేదు, అందువల్ల ఈ సినిమాలో నా పాత్రలో నటించడానికి కొంచెం కష్టతరం అయింది. నేను చాలా నేర్చుకోవలసి వచ్చింది, యాసను పట్టుకుని అచ్చం అలాగే యాసలో పలుకుతూ స్వప్న పాత్రలో నటించాను. నా పాత్రలో మంచి భావోద్వేగాలు ఉంటాయి.

కానీ, మీ సినిమాకి థియేటర్ స్పందనను కోల్పోతున్నారు కదా ?

అవును, మా సినిమా ఆన్‌ లైన్‌ లో విడుదలైంది. దాంతో థియేట్రికల్ అనుభవాన్ని మిస్ అయ్యాం. థియేటర్స్ లో మేము కూడా ప్రజలతో పాటు కూర్చుని సినిమా చూడలేకపోయాం అనే బాధ ఉంది.

మీ నేపథ్యం గురించి మాకు చెప్పండి?

నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. నా తల్లి, దీపా చందర్ పరిశ్రమకు చెందినవారే. కాస్ట్యూమ్ డిజైనర్‌గా 100కి పైగా చిత్రాలలో పనిచేశారు. నంది అవార్డును కూడా గెలుచుకున్నారు. కాబట్టి, నాకు పరిశ్రమలో నాకు మొదటి నుండి సంబంధాలు ఉన్నాయి. నేను కొంతకాలం న్యూయార్క్‌లో ఉన్నాను, ఆ సమయంలోనే నేను నటి కావాలని నిర్ణయించుకున్నాను.

మీకు ఈ సినిమాలో ఆఫర్ ఎలా వచ్చింది ?

నేను థియేటర్ నేపథ్యంలో పనిచేస్తున్నప్పుడు, దర్శకుడు దీపక్ నన్ను అక్కడ గుర్తించి ఈ సినిమాలో చేయమని అడిగారు. ఇక ఇది ఒక చిన్న చిత్రం, కానీ అతను నన్ను అంచనా వేసిన విధానం అద్భుతమైనది.

మీరు మీ కెరీర్‌ను ఎలా ప్లాన్ చేస్తున్నారు?

ఇప్పటి వరకు, నా కెరీర్ లో థియేట్రికల్ రిలీజ్ లేదు. థియేట్రికల్ రిలీజ్ కోసమే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతం నేను మంచి ఆఫర్లను పొందుతున్నాను. త్వరలో కొన్ని చిత్రాలకు సంతకం చేస్తాను. నాకు, పాత్ర ముఖ్యం. నా పాత్ర సినిమాలో కీలకమైనది అయి ఉండాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు