ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : శశాంక్‌ – లూజర్‌ తో నా సెకెండ్ ఇన్నింగ్స్‌ మొదలైంది !

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : శశాంక్‌ – లూజర్‌ తో నా సెకెండ్ ఇన్నింగ్స్‌ మొదలైంది !

Published on May 18, 2020 1:49 PM IST

మన లాక్ డౌన్ ఇంటర్వ్యూ సిరీస్ లో భాగంగా సై, అనుకోకుండా ఒక రోజు, ఐతే’ లాంటి చిత్రాలలో ప్రాముఖ్యం ఉన్న పాత్రలు చేసిన యాక్టర్ శశాంక్‌ ను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ విశేషాలు ఏమిటో చూద్దాం

 

మీరు నటించిన ‘లూజర్’ సిరీస్ కి మంచి సమీక్షలు వస్తున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది ?

గత రెండు రోజులుగా నా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. ఈ రకమైన స్పందనను నేను ఎప్పుడూ ఊహించలేదు. కెరీర్ ప్రారంభంలో, సై, అనుకోకుండా ఒక రోజు’ సినిమాలు చేసినప్పుడు నాకు లభించిన ప్రేమ, మళ్లీ ఇప్పుడు పునరావృతమవుతోంది అని అనిపిస్తోంది.

 

మీరు ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయింది. మీరు మీ కెరీర్‌ను ఎలా చూస్తారు?

15 సంవత్సరాలు అయ్యింది. నాకు వచ్చిన అవకాశాలను నేను పూర్తిగా ఉపయోగించుకున్నాను. మీరు నా కెరీర్‌ను చూస్తే, నేను నాన్‌స్టాప్ వర్క్ చేస్తున్నాను. లూజర్ లాంటి సిరీస్ చేసినప్పుడు మంచి అనుభూతి ఉంటుంది.

 

లూజర్ మీ కెరీర్ ను మారుస్తుందని మీరు అనుకుంటున్నారా?

నేను చాలానే ఆశిస్తున్నాను. ఇప్పుడు సినిమాలతో పాటు ఒటిటి కంటెంట్ లో కూడా ఖచ్చితంగా నా కోసం అవకాశాలు ఉంటాయి.అయితే కొన్ని మంచి పాత్రలు చేసి నా కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలని ఆశిస్తున్నాను.

 

లూజర్ లో విల్సన్ పాత్ర గురించి చెప్పండి?

లూజర్ దర్శకుడు అభిలాష్‌తో నాకు చాలా కాలంగా అనుబంధం ఉంది. నిజానికి నేను ప్రియదర్శి పాత్రను చేయాలి. కానీ స్క్రిప్ట్ అయిపోయాక నేను విల్సన్ పాత్ర పోషించాలని అభిలాష్ భావించాడు. నా పాత్ర కోసం నేను చాలా హోంవర్క్ చేసాను. వృద్ధుడిలా నా రూపాన్ని మార్చుకున్నాను. ఆ పాత్ర కోసం బరువు పెరిగాను. అలాగే, యింగ్ క్రికెటర్ గా కనిపించడానికి మళ్ళీ బరువు తగ్గించుకోవలసి వచ్చింది.

 

అన్నపూర్ణ స్టూడియోస్ మరియు లూజర్ బృందంతో మీ అనుబంధం?

అభిలాష్ మరియు అతని టీం అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ విద్యార్థులు. అప్పటి నుండి నాతో సన్నిహితంగా ఉన్నారు. నేను వారితో ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేశాను, చివరికి ఇప్పుడు లూజర్. అభిలాష్ చాలా సూపర్ టాలెంటెడ్. అన్నపూర్ణ స్టూడియోస్ మద్దతుతో, మేము ఈ వెబ్ సిరీస్‌ను మంచి నాణ్యతతో తియ్యగలిగాము.

 

మీకు పరిశ్రమలో మంచి పరిచయాలు ఉన్నాయి, కానీ మీరు వాటిని ఎందుకు ఉపయోగించలేదు.?

నా పని మాత్రమే మాట్లాడాలని నేను ఎప్పుడూ భావించాను. ఏ అవకాశాం అయిన నాకు వచ్చిందే చేశాను. అయితే గత సంవత్సరం నుండి నేను నా విధానాన్ని మార్చుకున్నాను. లూజర్ నుండి నా కొత్త కెరీర్ ప్రారంభం అవుతుంది.

 

పరిశ్రమలో మీకు ఎవరు ఎక్కువ మద్దతు ఇచ్చారు?

నేను సినిమాయేతర నేపథ్యం నుండి వచ్చాను, అయితే అల్లరి నరేష్ మరియు అతని కుటుంబం నాకు బాగా మద్దతు ఇచ్చారు. ఆ రోజుల్లో, నరేష్ నన్ను ముంబైకి తనతో పాటు నమిత్ కపూర్ దగ్గరకు కోచింగ్‌ కోసం తీసుకెళ్లడం నాకు స్పష్టంగా గుర్తుంది. ఆ సమయంలో నరేష్ నాకు ఇచ్చిన సహకారం మరియు మద్దతు పరిశ్రమలో నేను ప్రవేశించడానికి నాకు చాలా సహాయపడింది.

 

మీ నేపథ్యం గురించి మాకు చెప్పండి?

నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. నాన్న యస్.బి.ఐలో పని చేసారు. అమ్మ ప్రొఫెసర్. నా భార్య ట్రైనింగ్ అయిన పైలట్. మాకు ఇద్దరు పిల్లలు. నా తల్లిదండ్రులు మరియు నా భార్య నా కష్టతరమైన సమయాల్లో నన్ను ఎప్పుడూ ప్రోత్సహించారు.

 

మీరు రాజమౌళికి చాలా సన్నిహితంగా ఉన్నారు. మీ అసోసియేషన్ గురించి మాకు చెప్పండి?

నేను ఐతే చేస్తున్నప్పుడు, రమాగారు ఆ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ మరియు ఎడిటర్. ఆమెతో అప్పటినుంచే స్నేహం ఉంది. ఆ తరువాత గురువు రాజమౌళితో కూడా మంచి అనుబంధం. వాస్తవానికి, ఆయన లూజర్ ట్రైలర్‌ ను ఇష్టపడ్డారు. త్వరలోనే సిరీస్ ను చూస్తా అన్నారు.

 

మీ రెస్టారెంట్ వ్యాపారం గురించి?

అవును, నేను సికింద్రాబాద్‌లోని నా స్నేహితులతో కలిసి మాయాబజార్ అనే రెస్టారెంట్‌ను పెట్టాను. సినిమాలకు ప్రత్యామ్నాయ వృత్తిగా ఆ బిజినెస్ ప్రారంభించాను. ప్రారంభించి పదేళ్ళు అయ్యింది. నేను దానిని విస్తరించే ప్రణాళికలో ఉన్నాను.

 

భవిష్యత్ ప్రాజెక్టులు?

త్వరలో విడుదల కానున్న రెండు సినిమాల్లో చాలా మంచి పాత్రలు చేశాను. ఆఫర్లు వస్తున్నాయి.నేను మంచి స్క్రిప్ట్‌లను ఎన్నుకోవాలి. లూజర్ నాకు అందించిన సక్సెస్ వదులుకోను. ఆ సక్సెస్ ను అలాగే కొనసాగిస్తాను అంటూ శశాంక్‌ ఇంటర్వ్యూను ముగించాడు. ఆయన కొత్త ఇన్నింగ్స్‌ కి శుభాకాంక్షలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు