ఫిల్మ్ ట్రివియా : ఈ ఆల్ టైం క్లాసిక్ కు ముందు ఛాయిస్ షారుక్ కాదు మరెవరో తెలుసా?

ఫిల్మ్ ట్రివియా : ఈ ఆల్ టైం క్లాసిక్ కు ముందు ఛాయిస్ షారుక్ కాదు మరెవరో తెలుసా?

Published on Sep 5, 2020 3:59 PM IST

ఈ సెక్షన్ లో మేము 123తెలుగు ద్వారా మీకు తెలియని ఎన్నో ఆసక్తికర అంశాలను వెల్లడిస్తాము. నటులు, బాక్సాఫీస్, మ్యూజిక్, యాక్షన్ మేకింగ్, టెక్నిషీయన్స్ కు సంబంధించి ఇలా ఎన్నో అంశాలకు సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాము.

ఈరోజు హింట్ :

ఈరోజు మా ప్రశ్న ఏమిటంటే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కెరీర్ లోనే కాకుండా మొత్తం బాలీవుడ్ లోనే ఒక సెన్సేషనల్ హిట్ కాబడిన “దిల్ వాలే దుల్హేనియా లే జాయేంగే” సినిమా కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షారుక్ కెరీర్ లోనే ఈ చిత్రం ఒక బెంచ్ మార్క్ ను సెట్ చేసుకుంది. అయితే నిజానికి మాత్రం అసలు ఈ చిత్రానికి మొదటి ఛాయిస్ షారుక్ ఖానే కాదట. దర్శకుడు ఆదిత్య చోప్రా ముందు వేరే హీరోతో తియ్యాలని ప్లాన్ చేశారట. మరి ఆ హీరో ఎవరో తెలిస్తే కామెంట్ సెక్షన్ లో తెలియజెయ్యండి.


సమాధానం :

ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆ హీరో మరెవరో కాదు అది సైఫ్ అలీ ఖానే. షారుక్ కంటే ముందు దర్శకుడు ఆదిత్య చోప్రా సైఫ్ అలీ ఖాన్ ను పెట్టి ఈ చిత్రం తియ్యాలని అనుకున్నారట. ఆదిత్య చోప్రా తండ్రి షారుక్ పేరును చెప్పారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పక్కర్లేదు అనుకుంటా?

సంబంధిత సమాచారం

తాజా వార్తలు