కరోనా కంటే వర్మ గొంతే బయపెట్టేలా ఉందట..!

కరోనా కంటే వర్మ గొంతే బయపెట్టేలా ఉందట..!

Published on Apr 1, 2020 12:50 PM IST

కరోనా వైరస్ ఓ ప్రక్క ప్రపంచాని భయపడుతున్న వేళ..వివాదాల వర్మ మాత్రం తన మార్కు సెటైర్స్, సాంగ్స్ తో దానిని ఎంజాయ్ చేస్తున్నాడు. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుండి వర్మ ట్వీట్స్ అన్నీ.. గమనిస్తే అనేక కోణాలలో సైటైర్స్ వేస్తూ దేశాన్ని, ప్రజలను భయపెడుతూ వస్తున్నాడు. ఈ ట్వీట్స్ కి మించిన స్పందన ఆశిస్తూ దీనిపై ఓ సాంగ్ నే సిద్ధం చేశాడు.

‘అది ఒక పురుగు.. కనిపించని పురుగు… నలిపేద్దాం అంటే అంత సైజు లేదు దానికి, పచ్చడి చేద్దాం అంటే కండ లేదు దానికి…’ అని తనదైన శైలిలో పల్లవి అందుకున్నారు. ప్రస్తుతానికి జస్ట్ ప్రోమో వదిలిన వర్మ సాయంత్రం 5:30 నిమిషాలకు ఫుల్ సాంగ్ విడుదల చేయనున్నాడు. ఐతే కరోనా వైరస్ కంటే వర్మ గొంతే బయపెడుతుందని నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి వర్మ ఫుల్ సాంగ్ ఎలాంటి స్పందన దక్కించుకుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు