ఇంటర్వ్యూ : మృణాల్ ఠాకూర్ – “సీతారామం”లో యుద్ధం, మిస్టరీ అన్ని అంశాలు ఉంటాయి

ఇంటర్వ్యూ : మృణాల్ ఠాకూర్ – “సీతారామం”లో యుద్ధం, మిస్టరీ అన్ని అంశాలు ఉంటాయి

Published on Jul 31, 2022 11:59 AM IST

యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ అలాగే బాలీవుడ్ టాలెంటెడ్ నటి మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులని మెస్మరైజ్ చేసి చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఆగస్ట్5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో కథానాయిక మృణాల్ ఠాకూర్ శనివారంనాడు విలేఖరుల సమావేశంలో ముచ్చటించారు. ఆమె ఎలాంటి విషయాలు పంచుకున్నారో చూద్దాం రండి.

మీ కెరీర్ సీరియల్ నుంచి ఇప్పుడు పాన్ ఇండియా మూవీకి చేరింది ఎలా అనిపిస్తుంది?

నా మొదటి సీరియల్ బాలీవుడ్లో `కుంకుమభాగ్య.` అది అన్ని భాషల్లో డబ్ అయింది నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇలా తెలుగులో వైజయంతి మూవీస్ బేనర్ లో హీరోయిన్ గా చేస్తానని అనుకోలేదు. అందులోనూ దుల్కర్ సల్మాన్ హీరోగా, అశ్వనీదత్ నిర్మాతగా చేస్తున్న సినిమా నాకు ఇదో గొప్ప అచీవ్ మెంట్ లా ఫీలవుతున్నాను.

ఈ సినిమాలో రోల్ కి దర్శకుడు మిమ్మల్ని ఎలా ఎంపిక చేశారు?

హిందీ జెర్సీ రీమేక్ షూటింగ్ జరుగుతుండగా నేను చంఢీగర్ లో వున్నాను. హనుగారు ఫోన్ చేసి ఒకసారి కలవాలన్నారు. అలా ముంబైలో కాఫీషాప్ లో కలిశాం. ఆ తర్వాత పూర్తి కథను ఆఫీసులో విన్నా. ఆయన నెరేషన్ చేసే విధానం నా ఎగ్జైట్మెంట్ చూసి వెంటనే ఫిక్స్ చేశారు.

ఈ సినిమాలో మీ రోల్ కోసం చెప్పండి?

సీతా రామంలో సీత పాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి నటికి సీత పాత్ర చేయాలనే డ్రీమ్ వుంటుంది. నేను ధైర్యంగా చెబుతున్నా. ఇది నా పుట్టినరోజు గిఫ్ట్ గా భావిస్తున్నాను.

మరో హీరోయిన్ రష్మికతో నటించడం ఎలా అనిపించింది? మీ ఇద్దరి కాంబినేషన్ సీన్స్ వున్నాయా?

రష్మికలో ఎనర్జీ లెవల్ ఎక్కువ. తను ఒకరోజు ముంబై, మరో రోజు చెన్నై, ఫారిన్ ఇలా చలాకీగా తిరుగుతుంది. సెట్లో చాలా హుషారుగా వుంటుంది. అందరినీ చాలా కేర్ తీసుకుంటుంది. తను కేర్ ఫుల్ గా వుంటుంది. మా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయో లేదో సినిమాలో చూడాల్సిందే.

ఇది పీరియాడిక్ స్టోరీ మరి మీరెలా బ్యాలన్స్ చేశారు?

దర్శకుడు హను రాఘవపూడి ఇన్పుట్స్ తో పాటు స్వప్నగారి సూచనలు తీసుకున్నాను. నేను కుంకుమ భాగ్య చేస్తుండగా మా అమ్మమ్మనుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు సీత పాత్రకూ తీసుకున్నాను. ఇందులో డైలాగ్ లు చాలా పొయిటిక్ గా వుంటాయి. చిన్న చిన్న విషయాల్లోనూ దర్శకుడు కేర్ తీసుకోవడం విశేషం. నేను 2022 గాళ్ అయినా 1960 గాళ్ గా మీకు బాగా నచ్చుతాను.

పాన్ ఇండియా సినిమా కదా ఇండస్ట్రీ సపోర్ట్ ఎలా వుంది?

మా సినిమాకు విజయ్ దేవరకొండ, మమ్ముట్టితోపాటు బాలీవుడ్ లో అందరూ సపోర్ట్ చేశారు. ఇది నాకు చాలా సంతోషంగా వుంది.

సినిమా షూటింగ్ లో మీకు బాగా కష్టంగా అనిపించింది ఏంటి?

రష్యా, కశ్మీర్, స్విట్జర్లాండ్లో మైనస్ డిగ్రీలో చేయాల్సివచ్చింది. స్టడీ కామ్ తో షూట్ చేస్తుండగా దుల్కర్, దర్శకుడుకూడా పరుగెడుతూ చేశారు. నేనుకూడా చేశాను. అవసరమైతే ఇంకా చేస్తానని అని అడిగాను. ఒక దశలో డాన్స్ లో ఓ ముద్ర చేయాల్సి వచ్చింది. అంత చలిలోనూ నేను చేయగలిగాను అంటే నటిగా చేయాలి కాబట్టి అందుకు నేను ప్రిపేర్ అయ్యాను.

ఆడియెన్స్ సీతారామం సినిమాను ఎందుకు చూడాలంటారు?

సీతారామం వంటి కథలు రేర్ గా వస్తాయి. ఇప్పటి జనరేషన్లో అప్పటి అనుబంధాలు, ఆప్యాయతలు, అన్ని ఎమోషన్స్ కనిపిస్తాయి. ఇందులో కామెడీ కూడా వుంది. సుమంత్, తరుణ్ భాస్కర్ వంటి నటుల నటన, రష్మిక నటనతోపాటు విశాల్ చంద్రశేఖర్ సంగీతం సినిమాకు హైలైట్ గా వుంటుంది. యుద్ధం, మిస్టరీ అన్నీ అంశాలు ఇందులో వున్నాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా.

మరి తెలుగులో కొనసాగిస్తారా?

తప్పకుండా చేస్తాను. మంచి ఛాలెంజింగ్ పాత్రలు రావాలని కోరుకుంటున్నా. హిందీ, పంజాబీ, స్పానిష్, తెలుగు ఇలా అన్ని భాషల్లో చేయాలనుంది. తెలుగులో కథలు వింటున్నాను.

ఫైనల్ గా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి?

ప్రస్తుతం “పీపా” అనే సినిమా బాలీవుడ్లో చేస్తున్నా. ఇండియా బంగ్లాదేశ్ వార్ చిత్రం. ఆదిత్యరాయ్ కపూర్ తో ఓ సినిమా పూజామేరీ జాన్ అనే సినిమా చేశాను. మిగతావి చర్చల్లో ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు