బాలయ్య సస్పెన్స్ డ్రామా ?

బాలయ్య సస్పెన్స్ డ్రామా ?

Published on May 24, 2020 3:00 AM IST

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా రాబోతున్న సినిమా గురించి ఇప్పటికే అనేక రకాలుగా చాల రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే బాలయ్య ఈ సినిమాలో క‌వ‌ల‌లుగా నటించబోతున్నారని.. అందులో ఒక క్యారెక్టర్ విలన్ అని.. హీరో క్యారెక్టర్ కి, విలన్ క్యారెక్టర్ కి మధ్య జరిగే సస్పెన్స్ డ్రామానే బోయపాటి తనదైన మాస్ స్టైల్ లో తెరకెకెక్కించబోతున్నారని తెలుస్తోంది.

మెయిన్ గా సెకెండ్ హాఫ్ లో హీరో ఎవరు విలన్ ఎవరు అనే కోణంలో వచ్చే సస్పెన్స్ సీన్స్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయట. మొత్తానికి బాలయ్య జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు