ఇంటర్వ్యూ : సాయి పల్లవి – నేను రీమేక్స్ అందుకే చెయ్యను

ఇంటర్వ్యూ : సాయి పల్లవి – నేను రీమేక్స్ అందుకే చెయ్యను

Published on Sep 22, 2021 6:00 PM IST

ఇప్పుడు టాలీవుడ్ ఆడియెన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం “లవ్ స్టోరీ”. మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం. రేపు వచ్చే శుక్రవారం రిలీజ్ కి రెడీగా ఉంది. మరి ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ సాయి పల్లవి తాజా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మరి ఈ ఇంటర్వ్యూలో తాను ఏ విషయాలు పంచుకుందో చూద్దాం..

ఈ సినిమాకి ఫస్ట్ కాల్ లోనే ఓకే చెప్పారట కదా?

ఫస్ట్ కాల్ లోనే అంటే ముందు శేఖర్ కమ్ముల గారు కాల్ చేసిన వెంటనే ఓకే చెప్పెయ్యడం కాదు.. ముందు శేఖర్ గారు స్క్రిప్ట్ కోసం చెప్పి అడిగారు నువ్ చదివావా? నీకు కనెక్ట్ అయ్యేలా ఉందా అని అడిగారు. నేను ముందే ఓకే చెపుదాం అనుకున్నాను కానీ స్క్రిప్ట్ చదివాకా ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చి, నా రోల్ కొత్తగానే ఉన్నట్టు అనిపించింది అందుకే ఓకే చెప్పను.

భానుమతికి ఈ సినిమాలో మీ రోల్ కి తేడా ఏంటి?

భానుమతికి ఇందులో రోల్ కి చాలా తేడా ఉంటుంది, అక్కడ తన ఊరు, పెద్దలతో తాను ఉండాలి అనుకుంటుంది కానీ ఇక్కడ ఇలా కాదు తనని ఎవరైనా తక్కువ చెయ్యాలి చూసిన నీవల్ల కాదు అది అని చెప్పినా కూడా వాటిని ఎంతో పట్టుదలతో సాధించాలి అనుకునే రోల్ లో తను కనిపిస్తుంది.

సినిమాలో ఒక చిన్న ఊరి నుంచి సిటీకి వచ్చే జంట పడే స్ట్రగుల్స్ ని ఇతర అంశాలు ఎలా చూపించారు?

ఇలాంటి వాటిని చాలా రకాలుగా చూపించొచ్చు కానీ, శేఖర్ గారు మాత్రం దీనిని చాలా ఫన్ గా ఉండే విధంగా చూపిస్తారు. ఇపుడు మన సొంత ఊరిలో ఉన్నట్టయితే ఏదన్నా కావాలి అంటే అందరూ పక్కన ఉంటారు సాయం చేస్తారు. వాళ్ళకంటూ కొన్ని కేటాయించడం, ఎవరైనా బంధువులు వస్తే మీ కులం ఏంటి ఇలా ప్రశ్నలు వెయ్యం. కానీ కొన్ని విషయాల్లో అయితే మేకర్స్ కొన్ని ప్రశ్నలు వేసినట్టు ఉంటుంది. మన చుట్టూ ఏం జరుగుతుంది? వాటి కోసం అందరూ గొంతెత్తి ధర్నాలు చెయ్యమని చెప్పట్లేదు కానీ కనీసం గుర్తించాలి కదా అనేదే అసలు పాయింట్.

ఇలాంటి సినిమాలు వల్ల ఎవరైనా మారుతారు అంటారా?

మారుతారు అంటే అది అంతా అది ఎవరికి ఎవరు వ్యక్తిగతం గా ఆలోచించేదాని బట్టి ఉంటుంది. సినిమాలు చూసి వాళ్ళు ఇలా చెప్పారు కాబట్టే చేస్తున్నాం అంటే అది కరెక్ట్ కాదు. ఒక హీరో సిగరెట్ తాగుతున్నాడు అని అందరూ తాగమని కాదు అది జస్ట్ హీరో ఎలివేషన్ కోసం మాత్రమే అది చూసి చెయ్యాలి అన్నది వ్యక్తిగత అభిప్రాయం. సినిమా అనేది ఒక మాధ్యమం మాత్రమే.

మీరు ఒక కథ విన్నప్పుడు స్ట్రిక్ట్ గా ఇలాంటివి చెయ్యకూడదు అని అనుకున్నవి ఏమన్నా ఉన్నాయా?

అలా అని కాదు నైతికంగా ఏమన్నా బాగుంటే ఓకే చెప్తాను. కానీ కొన్ని మరీ ఓవర్ గా సమాజానికి చేదు చేసేలా ముఖ్యంగా యూత్ ని తప్పు దారి పట్టించేలా ఉండేవి అంటే నేను చెయ్యను. ఇంకా స్క్రిప్ట్ చదివేటప్పుడు బాగా తప్పుగా ఉంది అనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా అడుగుతాను వాళ్ళు చూసి మారుస్తారు.

చిరంజీవి గారి సినిమాలో రోల్ ఎందుకు వద్దు అనుకున్నారు? రీమేక్ అనా లేక సిస్టర్ గా అనా?

రోల్ ఏది అని కాదు రీమేక్ సినిమా అనే నో చెప్పాను. అలా అని నేను కంప్లీట్ గా రీమేక్స్ చెయ్యను అని కాదు. కంప్లీట్ గా ఒక సినిమా ఆడియెన్స్ ఈ సినిమాని కోరుకుంటున్నారు, ఇంకా అది ఆల్రెడీ డబ్ కాకుండా ఉండి, దాన్ని మరింత బెటర్ గా నేను ప్రెజెంట్ చెయ్యగలను అని ఎవరైనా చెప్తే అపుడు రీమేక్ సినిమాలు చేస్తాను.

చైతూతో వర్క్ ఎలా అనిపించింది.?

చైతూ సినిమాలో చాలా బాగా చేశారు. నాకు చాలా సార్లు కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా నాకు చాలా కంఫర్ట్ వాతావరణం సెట్స్ లో ఇచ్చారు.

మరి శేఖర్ కమ్ములతో రెండోసారి చేశారు ఇదెలా అనిపించింది?

శేఖర్ గారు సెట్స్ లో చాలా కూల్ గా ఉంటారు. ప్రతి ఒక్కరితో కూడా చాలా బాగా ఉంటారు. ఇంకా టీం వర్క్ ని బాగా నమ్ముతారు.

మిగతా సినిమాలు విరాట పర్వం, శ్యామ్ సింగ రాయ్ కోసం చెప్పండి..

రెండు సినిమాలు కూడా షూట్ అంతా కంప్లీట్ అయ్యిపోయాయి. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనే ఉన్నాయి. రెండిట్లో కూడా నా రోల్స్ చాలా కొత్తగా ఉంటాయి. వీటి విషయంలో మాత్రం చాలా ఎగ్జైటెడ్ గానే ఉన్నాను.

ఇక ఫైనల్ గా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం చెప్పండి

ప్రస్తుతానికి అయితే తెలుగులో ఓ సినిమా కోసం చర్చ నడుస్తుంది. అలాగే తమిళ్, మళయాళంలో కూడా ఉన్నాయి. ఇంకా హిందీలో వెబ్ సిరీస్ లపై కూడా కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి. వాటిపై తొందరలోనే క్లారిటీ ఇస్తాను.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు