ఇంటర్వ్యూ : సందీప్ కిషన్ – “ఏ1 ఎక్స్ ప్రెస్” ఒక మాసివ్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్

ఇంటర్వ్యూ : సందీప్ కిషన్ – “ఏ1 ఎక్స్ ప్రెస్” ఒక మాసివ్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్

Published on Mar 3, 2021 5:05 PM IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా డెనీస్ దర్శకత్వంలో తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా “ఏ1 ఎక్స్ ప్రెస్”. పాటల నుంచి రీసెంట్ ట్రైలర్ వరకు కూడా మంచి హైప్ ను తెచ్చుకున్న ఈ చిత్రం సందీప్ కు 25వ సినిమాగా కాస్త స్పెషల్ గానే ఈ మార్చ్ 5న విడుదలకు రెడీ అవుతుంది.మరి ఈ సందర్భంగా సందీప్ నుంచి ఓ ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఇందులో అతడు ఎలాంటి విషయాలను పంచుకున్నాడో చూద్దాం.

మీ 25వ సినిమాగా ఒక రీమేక్ నే ఎందుకు ఎంచుకున్నారు?

నా 25వ సినిమాగా ఒక రీమేక్ అనే కన్నా కంటెంట్ ను తీసుకున్నామని చెప్తాము. ఎందుకంటే ఇది ఒక పర్ఫెక్ట్ కంటెంట్ అనిపించింది. మేమేం అనుకున్నాం అంటే ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు కూడా భయంకరంగా ఎంజాయ్ చెయ్యాలి ముఖ్యంగా ఇందులోని కీ పాయింట్ ను తెలుసుకోవాలని ప్లాన్ చేసాం. ఇంకా చెప్పాలి అంటే ఒరిజినల్ వెర్షన్ కు అప్పట్లో తమ లిమిటెడ్ బడ్జెట్ కు ఇంతే చెయ్యగలం అని చెప్తే అంతలోనే చేశామని మ్యూజిక్ డైరెక్షర్ హిప్ హాప్ తమీజా చెప్పాడు. ఒకవేళ మేము ఎక్కువ పెడితే దాని కన్నా బెటర్ చేంజెస్ చెయ్యొచ్చని చెప్పారు. సో మేము జస్ట్ ఒక ఐడియాకు మాత్రమే రేట్ ఇచ్చాం తప్పితే మిగతా అంతా కొత్తగా ఉంటుంది.

ఈ సినిమాలో మీకు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ ఏంటి?

ఈ సినిమా విషయంలో అంటే అది నిన్ననే జరిగింది అని చెప్పాలి. మేము తెలుగులో చేస్తున్న ఫస్ట్ ప్రయత్నం కాబట్టి ఎంత వరకు వెళ్ళాలో అంత వరకు వెళదాం అనుకున్నాం ఇలా అన్ని పనులు జరుగుతుంటే నిన్ననే సెకండాఫ్ చూసి నాతో తొమ్మిదేళ్లు ట్రావెల్ చేసిన టీం కాల్ చేసి ఏడ్చేస్తున్నారు అప్పుడు నాకు కూడా కళ్లనుంచి నీళ్లొచ్చేసాయ్ అదే ఎక్స్ పీరియన్స్ ను రేపు థియేటర్స్ నుంచి వస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది.

మీరు రోమ్ కామ్ చేసారు ఎమోషనల్ కూడా చేశారు రెండిట్లో తేడా ఏం చూసారు?

రోమ్ కామ్ లో ఏముండవండి ఏదో సింపుల్ గా ఇచ్చినవి చేసేస్తే చాలు అన్నట్టే ఉంటుంది. కానీ ఇలాంటి వాటిలో మాత్రం ఒక గ్రాఫ్, జర్నీ, అప్ అండ్ డౌన్స్ లాంటి చాలా ఉంటాయి నటుడిగా ఏం ప్రూవ్ చేసుకోవాలి అన్నది ఉంటాయి. అలాగే నాకు రోమ్ కామ్ గా ఏముండవా అంటే ఉన్నాయి నాకు లావణ్యకి కెమిస్ట్రీ సూపర్బ్ గా వర్క్ అయ్యింది కానీ కోర్ స్టోరీ అది కాదు కదా అందుకే దీన్ని ఒక కొత్త కమెర్షియల్ ఫిలిం అని చెప్తా నేను.

ఒక స్పోర్ట్స్ మెన్ పొలిటికల్ కష్టాలను చూపించే ప్రయత్నం చేసినట్టున్నారు?

ఇక్కడ పొలిటికల్ కష్టాలు అని కాదు దానికి దీనికి సంబంధం లేదు ఇక్కడ ఏమవుతుంది అంటే ఎంతో కష్టపడుతున్న ఒక స్పోర్ట్స్ మెన్ కు రావాల్సిన గుర్తింపు ఆదరణ రావట్లేదు ఇది ఎందులో తీసుకున్నా సరే..అందుకు సింపుల్ గా ఆ పదాన్ని అన్నాం తప్పితే దానికి దీనికి సంబంధం లేదు.

ఈ సినిమా కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు?

ఈ సినిమా కోసం మొత్తం ఆరు నెలలు ముందే హాకీ నేర్చుకున్నా. ఒక అథ్లెట్ రోల్ చెయ్యాలి అంటే అలా కనిపించాలి ముఖ్యంగా ఆ ఆట కూడా రావాలి. అందుకే మోసం లాంటివి ఏం లేకుండా చాలా నేర్చుకొనే చేశా.. సినిమాలో మాత్రం హాకీ గేమ్ అదిరిపోద్ది.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అనగానే ఒక రష్ ఉంటుంది ఈ సినిమాకి ఎలా అనిపించింది?

ఇందులో అంతా కొత్తగా ఉంటుంది. మొహాలీ స్టేడియమ్ లోకి చూస్తే అదే ఫిల్మ్ నగర్ అంత ఉంది. అందులో కెమెరా పట్టుకొని ఎలా అనుకున్నాం. అలాగే నేను చేసిన టీం తో పాటుగా ఆపోజిట్ టీం కు అండర్ 19లో ఆడిన రియల్ హాకీ ప్లేయర్స్ 8మందిని తీసుకొచ్చాం. వాళ్ళు ఒక్క రోజుకు 5వేలు అడిగారు. దానికి నేను షాక్ అయ్యా ఇంత తక్కువా అని అంటే దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందా అన్నది అందుకే ఇలాంటి పాయింట్ నే ఈ సినిమాలో చూపించి మా వంతు ప్రయత్నం చేసాం.

క్రికెట్ తో పోలిస్తే హాకీకి ఆదరణ తక్కువ సో రిస్క్ ఏమన్నా అనిపించిందా?

నేను అదే అంటున్నా ఆల్రెడీ క్రికెట్ చాలా పాపులర్ కాబట్టి కొత్తగా ట్రై చెయ్యాలని హాకీ తీసుకున్నాం. వాటిలో గ్రీన్ టర్ఫ్ కనబడితే ఇందులో బ్లు కనిపిస్తుంది. ఇలా కొత్తగా ఉంది కాబట్టే రిస్క్ కూడా నేనేం అనుకోలేదు.

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా కోసం చెప్పాలి అంటే ఏం చెప్తారు?

ఇది ఒక మాసివ్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్.. అంతే ఇది మొదలు పెట్టినప్పుడే అనుకున్నాం నెక్స్ట్ చేసే సినిమా పెద్ద హిట్టవ్వాలి ఇంతకు ముందు ఎపుడు టచ్ చెయ్యనిది అనుకున్నాం మేము ఏదైతే అనుకున్నామో దాన్ని 100 పర్సెంట్ మ్యాచ్ చేసాం అని చెప్పగలను.

ఈ సినిమాకి హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా చేశారు..

ప్రొడక్షన్ అనేది ఎందుకు అంటే చాలా ఎగ్జైటింగ్ గా క్రియేటివ్ జాబ్ లా అనిపిస్తుంది ఇంకా అంతా ప్రొడక్షన్ అంటే ఫైనాన్సియల్ గానే అనుకుంటారు కానీ అలా కాదు అది క్రియేటివ్ జాబ్ మాత్రమే. ఇంకోటి కొన్నిసార్లు మనకి ఏదన్నా బాగా నమ్మితే అందులో మనం కూడా భాగస్వామి కావాలి అందుకే నేను ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా కూడా చేశాను.

ఇలాంటి సినిమాకి డెబ్యూ డైరెక్టర్ రిస్క్ అనిపించలేదా?

నాకెప్పుడూ డెబ్యూ డైరెక్టర్ లే వర్కౌట్ అయ్యారు. ఇప్పటి వరకు చేసిన వాళ్ళు ఫస్ట్ లేదా సెకండ్ సినిమా దర్శకులే..లోకేష్ కనగ్ రాజ్, వి ఐ ఆనంద్ ఇంకా అందరికీ ఇలానే ఉన్నాయి. సో ఇందులో ఏం అనిపించలేదు డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా బాగా పని చేశారు.

ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కోసం..?

ఇదవ్వగానే “రౌడీ బేబీ” ఆల్ మోస్ట్ అయ్యిపోయింది అది కూడలి లైన్ చాలా బాగుంటుంది. ఇంకా “వివాహ భోజనంబు” లో చిన్న క్యామియో ఉంది చాలా క్యూట్ ఫిల్మ్ అది. అదవ్వగానే మహేష్ కోనేరు ప్రొడక్షన్ లో ఒకటి ఏకే ఎంటెర్టైన్మెంట్స్ లో ఒకటి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు