గ్రాండ్ లెవెల్ ప్రమోషన్స్ తో దూసుకెళ్తున్న ‘కార్తికేయ – 2’ టీమ్

గ్రాండ్ లెవెల్ ప్రమోషన్స్ తో దూసుకెళ్తున్న ‘కార్తికేయ – 2’ టీమ్

Published on Aug 9, 2022 6:00 PM IST

నిఖిల్ సిద్దార్ధ, అనుపమ పరమేశ్వరన్ ల లేటెస్ట్ మూవీ కార్తికేయ 2, ఆగష్టు 13న భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీని టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి నిర్మించగా యువ దర్శకుడు చందూ మొండేటి దీనిని తెరకెక్కించారు. యువ సంగీత దర్శకుడు కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉండగా, ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్స్ రెండూ కూడా మూవీ పై అంచనాలు అమాంతం పెంచేసాయి.

ఇక తమ మూవీకి సంబంధించి ఇప్పటికే ట్రెజర్ హంట్ పేరుతో ఒక ఆసక్తికరమైన కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్తికేయ 2 యూనిట్, మూవీని మరింతగా ప్రేక్షకాభిమానులకి చేరువ చేసేలా ప్రస్తుతం పలు ప్రాంతాల్లోని ప్రజలతో ఇంటరాక్ట్ అవుతోంది. ఇప్పటికే నేడు ఉదయం విశాఖపట్నం లో సందడి చేసిన ఈ మూవీ టీమ్, ప్రస్తుతం విజయవాడ చేరుకొని అక్కడి పివిపి మాల్ లో ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతోంది. మొత్తంగా రోజురోజుకు అందరిలో కార్తికేయ 2 పై అంచనాలు మరింత భారీగా పెరుగుతూ ఉండడంతో తప్పకుండా వాటిని అందుకునేలా సినిమా ఉంటుందని అంటోంది యూనిట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు