లాక్ డౌన్ లో కార్తికేయతో లావణ్య త్రిపాఠి..!

Published on May 25, 2020 3:14 pm IST

కార్తికేయ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా తెరకెక్కబోతున్న చిత్రం “చావు కబురు చల్లగా”. కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. కాగా
కార్తికేయ, లావణ్య త్రిపాఠి ఈ లాక్ డౌన్ లో కూడా తమ ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుంటున్నారట. తమ దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి ఆన్‌ లైన్ వర్క్‌ షాప్‌లు నిర్వహిస్తున్నాడట. వర్క్ షాప్ లో లావణ్య మరియు కార్తికేయ స్క్రిప్ట్ చదివి వారి పాత్రలకు సంబంధించిన సీన్స్ ను ఇద్దరు ప్రాక్టీస్ చేస్తున్నాడట.

త్వరలో షూటింగ్ జరుపుకోనున్న ఈ మూవీ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా రానుంది. విభిన్నమైన పాత్రలో నటించే కార్తికేయ ఈ మూవీలో బస్తీ బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. దర్శకుడు కౌశిక్ చెప్పిన పాయింట్ నచ్చి నిర్మాత బన్నీ వాసు ఈ సినిమాను కార్తికేయతో చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

More