లావణ్యను కరోనా వైరస్ భయం వెంటాడుతుందట

Published on May 24, 2020 8:01 pm IST

కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన పరిస్థితులు భయానక వాతావరణాన్ని ఏర్పరిచాయి. సామాన్యుల నుండి సెలెబ్రటీల వరకు దీని బారిన పడుతున్నారు. బాలీవుడ్ లో ఇప్పటికే కొంత మంది ప్రముఖులకు కరోనా వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో షూటింగ్స్ లో పాల్గొనాలంటే హీరోయిన్ లావణ్య త్రిపాఠికి చాల భయంగా ఉంటుందట. టాలీవుడ్ లో కొద్దిరోజులలో షూటింగ్స్ యథావిధిగా ప్రారంభం కానున్నాయి. దీనితో లావణ్య త్రిపాఠి తాను నటిస్తున్న ఏ వన్ ఎక్సప్రెస్ మూవీ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది.

‘షూటింగ్ లో పాల్గొనాలంటే భయంగా ఉంది. అనేక మంది పాల్గొనే షూటింగ్ సెట్స్ లో ఒక్కరికి ఉన్నా అందరికీ సోకె ప్రమాదం ఉంది. మరి దీని బారిన పడకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో’ అని అనుమానం, భయం వ్యక్తం చేసింది లావణ్య త్రిపాఠి. ఈమె నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ఏ వన్ ఎక్స్ ప్రెస్ మూవీలో హీరోగా సందీప్ కిషన్ నటిస్తున్నారు. హాకీ బేస్డ్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ మూవీకి డెన్నిస్ జీవన్ దర్శకత్వం వహిస్తున్నారు. హిప్ హాప్ తమీజ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More