లాక్ డౌన్ రివ్యూ : “అభయ్ 2” – హిందీ సిరీస్ “జీ 5″లో ప్రసారం

లాక్ డౌన్ రివ్యూ : “అభయ్ 2” – హిందీ సిరీస్ “జీ 5″లో ప్రసారం

Published on Aug 27, 2020 3:41 PM IST

నటీనటులు: కునాల్ ఖీము, సందీపా ధర్, ఆశా నేగి, రామ్ కపూర్, నిధి సింగ్, చంకీ పాండే, రాఘవ్ జుయాల్, అషీమా వడాన్, బిడితా బాగ్

దర్శకత్వం : కెన్ ఘోష్

నిర్మాతలు : బి.పి. సింగ్, రేణు బి.పి. సింగ్

సినిమాటోగ్రఫీ : హరి కె. వేదాంతం

ఎడిటర్ : ముఖేష్ ఠాకూర్

ఈ లాక్ డౌన్ సమయంలో పలు చిత్రాలు మరియు సిరీస్ ల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో నేడు మేము ఎంచుకున్న సిరీస్ “అభయ్ 2”.జీ 5 స్ట్రీమింగ్ యాప్ లో అందుబాటులో ఉన్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇంతకు మునుపు వచ్చిన సీజన్ అభయ్ 1 తోనే ఈ సిరీస్ ఒక కాప్ డ్రామా అని అందరికీ తెలిసిందే.మొదటి సీజన్లో హీరో కు సంబంధించిన ఎపిసోడ్స్ తో మేకర్స్ తీర్చిదిద్దారు. కానీ ఇప్పుడు దానికి కొనసాగింపుగా వచ్చిన ఈ సీజన్లో అభయ్ ప్రతాప్(కునాల్ ఖీము) విలన్ చూకీ పాండేల, బందితా బాగ్ మరియు రామ్ కపూర్ లతో ఒక్కో ఛాలెంజింగ్ ఎపిసోడ్ ఉంటుంది. అలాగే ఒక్కో ఎపిసోడ్ కు డిఫరెంట్ లైనప్ ఉంటుంది. ఇంతకీ అవేంటి హీరో ఆ ఛాలెంజ్ లను ఎలా పూర్తి చేసాడు అన్నదే అసలు కథ.

 

ఏం బాగుంది?

 

ఈ సిరీస్ లో ప్రధాన పాత్రదారుడు అభయ్ ప్రతాప్ గా కనిపించిన కునాల్ ఖీము డీసెంట్ లుక్స్ తో ఒక పోలీస్ ఆఫీసర్ గా సెటిల్డ్ గా కనిపించాడు. అలాగే ఒక్కో ఎపిసోడ్ కు తగ్గట్టుగా తన మంచి పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. అలాగే మెయిన్ విలన్ గా కనిపించిన చూకీ పాండే అయితే సైకో విలన్ తనదైన విలనిజాన్ని మరోసారి చూపించారు.

అలాగే చూకీ పాండేతో మరో విలన్ గా గా కనిపించిన రామ్ కపూర్ ను చూపించిన విధానం కానీ అతనిపై డిజైన్ చేసిన కిడ్నాపింగ్ ఎపిసోడ్స్ కానీ, పలు ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ చాలా బాగుంటాయి. వీరితో బాగా బోల్డ్ గా కనిపించిన ఫిమేల్ పాత్ర బంతియా. ఈమె ఓ వ్యభిచారిగా దర్శకుడు రాసుకున్న రోల్ కు అద్భుతంగా చేసింది.అలాగే ఈ సిరీస్ లోని ఒక్కో ఎపిసోడ్ స్టోరీ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, నిర్మాణ విలువలు, కెమెరా వర్క్ కానీ సాలిడ్ గా అనిపిస్తాయి.

 

ఏం బాగోలేదు?

 

ఈ సిరీస్ కు పెద్ద ఫ్లా ఏదన్నా ఉంది అంటే అది కథనం విషయంలో అనే చెప్పాలి. కథ పరంగా దర్శకుడు కెన్ ఘోష్ సాలిడ్ కంటెంట్ ను ఎన్నుకొన్నారు. కానీ ఒక్కో ఎపిసోడ్ లో ఇంకా గ్రిప్పింగ్ గా చూపించాల్సిన దానిని చాలా సింపుల్ గా చూపించేసినట్టు అనిపిస్తుంది. అలాగే ట్విస్టులు కూడా ఏమంత గొప్పగా అనిపించవు. అలాగే ఇతర కాస్టింగ్ లో కానీ కొన్ని సన్నివేశాలు కానీ అంతగా ఆకట్టుకోవు. వీటితో పాటు స్క్రీన్ ప్లే ను కూడా మరింత అందంగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది.

 

చివరి మాటగా :

 

ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఒక్కో ఎపిసోడ్ లో జరిగే క్రైమ్స్ కు పోలీసులకు మధ్య జరిగే డ్రామా ఎలా ఉంది అన్నదే మెయిన్ ప్లాట్. అయితే ఈ రెండో సీజన్లో మంచి కథ మరియు మెయిన్ రోల్స్ ప్రదర్శించిన పెర్ఫామెన్స్ లు అసలైన ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కానీ సరైన స్క్రీన్ ప్లే మరియు కథనంలో కాస్త నెమ్మదిదనం ఉండడం మూలాన మంచి కథే అయినా బాలెన్సుడ్ గా ఉన్నట్టు అనిపించదు. సో ఈ సిరీస్ ను ఒక లుక్కేయ్యొచ్చు.

Rating: 2.75/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు