లాక్ డౌన్ రివ్యూ : ‘కాక్టెయిల్’ ( జీ5లో ప్రసారం)

లాక్ డౌన్ రివ్యూ : ‘కాక్టెయిల్’ ( జీ5లో ప్రసారం)

Published on Jul 13, 2020 3:45 PM IST


తారాగణం: యోగి బాబు, రష్మి గోపీనాథ్, మిథున్ మహేశ్వరన్ తదితరులు

సంగీతం : సాయి భాస్కర్

దర్శకత్వం : రా విజయ మురుగన్

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి సినిమాగా వచ్చిన సినిమా ‘కాక్టెయిల్’. రా విజయ మురుగన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ‘జీ5’లో అందుబాటులో ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథా నేపథ్యం :

డాన్ (యోగి బాబు) మరియు అతని టీంలోని నలుగురు క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి తమ స్నేహితుడి ఇంట్లో పార్టీ చేసుకుంటారు . అయితే వారు మరుసటి రోజు ఉదయం మేల్కొనే సరికి అక్కడ ఒక అమ్మాయి మృతదేహం ఉంటుంది. ఇంతలో, మరొక సందర్భంలో, ఒక విగ్రహం పోతుంది. నిజాయితీగల పోలీసు, రాజా మణికెన్ (సాయాజీ షిండే ) నేరస్థులను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం రెండు కథలు ఒక పాయింట్ తర్వాత కనెక్ట్ అవుతాయి. ఈ క్రమంలో మరింత భయాందోళనలను ఎదురవుతాయి. ఇంతకీ చంపబడిన అమ్మాయి ఎవరు? అలాగే విగ్రహ దొంగతనం ఏమిటి? మరియు డాన్ మరియు అతని ఫ్రెండ్స్ తమను తామూ ఎలా రక్షించుకున్నారు ? అనేది మిగిలిన కథ.

ఏం బాగుంది :

యోగి బాబు ఈ చిత్రంలో, తన నుండి ప్రేక్షకులు ఆశించిన కామెడీని బాగానే అదించాడు. ముఖ్యంగా తన పాత్రతో తన టైమింగ్ తో ఈ చిత్రాన్ని తన భుజాల పై మోసాడు. అతని వన్ లైనర్స్ చాలా బాగున్నాయి. షాయాజీ షిండే కూడా పోలీసుగా చక్కగా నటించాడు. ఇక ఈ చిత్రం ఒక ఆసక్తికరమైన ప్లేతో ప్రారంభిస్తుంది మరియు కథాంశం కూడా బాగా సెట్ చేయబడింది. అలాగే, క్రైమ్ యాంగిల్ యొక్క ఆలోచన కూడా కథలో బాగా సెట్ అయింది. పైగా చాలా ఉద్రిక్తమైన మరియు తీవ్రమైన క్షణాల్లో కొన్ని సిట్యుయేషనల్ కామెడీ సన్నివేశాలను దర్శకుడు బాగా ఆలోచించి తెరకెక్కించారు.

ఏం బాగాలేదు :

ఈ చిత్రం హ్యాంగోవర్ వంటి అనేక చిత్రాలలోని సీన్స్ ఆధారంగా సాగుతుంది. కీ రోల్స్ తమకు తెలియకుండానే ఇబ్బందుల్లో పడటం వంటి కథను కలిగి ఉండటం బాగున్నా.. కథలో నమ్మశక్యం కానీ సీన్స్ ఉండటం, మరియు పూర్తి తమిళ నేటివిటీలోనే సాగడం, అలాగే కథనం కూడా బోర్ గా సాగడంతో సినిమా ఫలితం దెబ్బ తింది.

పైగా ఈ చిత్రం యొక్క చాలా భాగం, ఏమి జరుగుతుందో మరియు సినిమాలోని మొత్తం సమస్య ఏమిటో సరిగ్గా ఎలివేట్ కాలేదు. యోగిబాబు బ్యాచ్ దృష్టాంతంలో ఎలా తప్పించుకుంటున్నారో విషయాలు సరిగ్గా చూపించబడలేదు. క్లైమాక్స్ కూడా బాగాలేదు. దర్శకుడు ఒక చిత్రం చేయడానికి చాలా చిత్రాల సన్నివేశాలను ఉపయోగించుకోవడం చికాకు పుట్టిస్తోంది.

చివరి మాటగా :

మొత్తంమీద, ఈ ‘కాక్టెయిల్’ సినిమా అనేక క్రైమ్ కామెడీ సినిమాలలోని కంటెంట్ ను మిక్స్ చేసి తెరకెక్కించిన సినిమాలా అనిపిస్తోంది. అయితే యోగి బాబు తన సిట్యుయేషనల్ కామెడీతో ఒక ఆహ్లాదకరమైన హాస్యాన్ని తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించినా అది వర్కౌట్ అవ్వలేదు. ఈ లాక్డౌన్ సమయంలో మీరు ఈ సినిమాని చూడకపోవడమే బెటర్.

Rating: 2/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు