లాక్ డౌన్ రివ్యూ: కప్పేలా-మలయాళ ఫిల్మ్(నెట్ ఫ్లిక్స్)

లాక్ డౌన్ రివ్యూ: కప్పేలా-మలయాళ ఫిల్మ్(నెట్ ఫ్లిక్స్)

Published on Jul 2, 2020 4:23 PM IST

నటీనటులు: అన్నా బెన్, శ్రీనాథ్ భాసి, రోషన్ మాథ్యూ

దర్శకత్వం: ముహమ్మద్ ముస్తఫా

నిర్మాత: విష్ణు వేణు

సినిమాటోగ్రఫీ: జిమ్షి ఖలీద్

ఎడిటర్: నౌఫల్ అబ్దుల్లా

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు మలయాళ ఫిల్మ్ కప్పేలా ను ఎంచుకోవడం జరిగింది. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న ఈ రొమాంటిక్ లవ్ డ్రామా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

 

కథాంశం ఏమిటీ?

 

ఓ రాంగ్ కాల్ ద్వారా జెస్సీ, విష్ణుకు పరిచయం ఏర్పడుతుంది. వీరి ఫోన్ పరిచయం ప్రేమ వరకు వెళుతుంది. ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమలో పడిన ఈ జంట ఓ రోజు కలుసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఐతే జెస్సీ ని కలవడానికి రాయ్ వస్తాడు. విష్ణు ఎలా ఉంటాడో తెలియని జెస్సీ రాయ్ ని విష్ణు అనుకుంటుంది. అసలు ఈ రాయ్ ఎవరు? జెస్సీని కలవాల్సిన విష్ణు ఏమయ్యాడు? చివరకు జెస్సీ, విష్ణు కలిశారా లేదా? వీరిద్దరి కథ ఎలా ముగిసింది? అనేది తెరపైన చూడాలి…

 

ఏమి బాగుంది?

యంగ్ విలేజ్ గర్ల్ గా అన్నా బెన్ నటన ఈ మూవీకి ఆకర్షణ. ఇన్నోసెంట్ క్యూట్ కేరళ అమ్మాయిగా ఆమె చాలా సహజంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె తన కళ్ళతో కష్టమైన భావాలు తేలికగా పలికించింది.

విష్ణు పాత్ర చేసిన రోషన్ మాథ్యూ పాత్ర ప్రేక్షకులకు షాక్ గురిచేస్తుంది. అతని పాత్రలోని ఉహించని వేరియేషన్స్ చక్కగా పలికించాడు. రెండు షేడ్స్ కలిగిన పాత్రకు న్యాయం చేశాడు. మరో ప్రాధాన్యం ఉన్న పాత్ర చేసిన శ్రీనాథ్ భసి కూడా తన పరిధి మేర మెప్పించారు.

సామాజిక సందేశంతో కూడిన రొమాంటిక్ డ్రామా ఆకట్టుకుంది. అమాయకంగా ఆడపిల్లలు ఎలా మోసపోతున్నారో … దానివలన ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చక్కగా వివరించారు. నిర్మాణ విలువలు, కెమెరా వర్క్ బాగున్నాయి. బీజీఎమ్ ఆకట్టుకుంది.

 

ఏమి బాగోలేదు?

 

రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా తెరకెక్కించిన ఈ మూవీలో దర్శకుడు కమర్షియల్ అంశాల జోలికి వెళ్ళలేదు. అదొక మైనస్ గా చెప్పుకోవచ్చు. ఇక ప్రధాన కథను చెప్పడానికి ఆయన చాలా సమయం తీసుకున్నాడన్న భావన కలిగింది.

 

చివరి మాట:

 

అలరించే రొమాన్స్, ఊహించని మలుపులు, ఆసక్తికర కథనంతో సాగే కప్పేలా తప్పక చూడదగ్గ చిత్రం అని చెప్పొచ్చు. సామాజిక అంశాన్ని ఆకట్టుకొనేలా చెప్పిన దర్శకుడి ప్రతిభకు మంచి మార్కులు పడతాయి. ఈ లాక్ డౌన్ సమయంలో కప్పేలా మంచి ఛాయిస్.

Rating: 3.5/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు