లాక్ డౌన్ రివ్యూ : ‘మసబా మసబా’ (నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం)

లాక్ డౌన్ రివ్యూ : ‘మసబా మసబా’ (నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం)

Published on Aug 31, 2020 2:24 PM IST

తారాగణం: మసబా గుప్తా, నీనా గుప్తా తదితరులు
రచన : సోనమ్ నాయర్
దర్శకుడు: సోనమ్ నాయర్

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి వెబ్ సిరీస్ గా వచ్చిన సిరీస్ ‘మసబా మసబా’. సోనమ్ నాయర్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ‘నెట్ ఫ్లిక్స్’లో అందుబాటులో ఉంది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథా నేపథ్యం :

ఈ సిరీస్ డిజైనర్ మసబా గుప్తా యొక్క గందరగోళ జీవితంలోని పలు సఘటనల ఆధారంగా రూపొందించబడింది. ఆమె బాలీవుడ్లో టాప్ డిజైనర్ గా ఎలా ఎదిగింది, అలాగే ఆమె జీవితంలో విడాకుల అంశంతో పాటు ఆమె ఫ్యాషన్ డిజైనర్ గా ఎలాంటి సమస్యలను ఎదుర్కొంది ? మరోవైపు, ఆమె తల్లి నీనా గుప్తా 60 సంవత్సరాల వయస్సులో కూడా తనను తాను నిరూపించుకోవడానికి ఎలా ప్రయత్నిస్తోంది. నిజ జీవిత పాత్రలు పోషించే తల్లి మరియు కుమార్తెల జీవితంలోని పలు అంశాల గురించి ఒక కల్పిత కథగా ఈ సిరీస్ వచ్చింది. మొత్తం ఆరు ఎపిసోడ్లు ఈ సిరీస్ లో ఉన్నాయి.

ఏం బాగుంది :

మొదట, డిజైనర్ మసబా గుప్తా ఈ సిరీస్ తో తానూ నటనలో అడుగుపెట్టింది. ఆమె తన పాత్రలో ఆశ్చర్యకరంగా అద్భుతమైన నటనతో బాగా చేసింది. అలాగే ఆమె డిఫరెంట్ లుక్ కావచ్చు, అలాగే అన్ని బోల్డ్ సన్నివేశాల్లో కూడా ఆమె నటించిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా మసబా భావోద్వేగాలను బాగా పండించింది. రాబోయే రోజుల్లో ఆమె మరిన్ని చిత్రాల్లో నటించడానికి ప్రయత్నించాలి.

నీల్ భూపాలం బిజినెస్ టైకూన్ గా అద్భుతంగా ఉంది. ఆమె క్యారెక్టర్ సెటప్ కి బాగా సరిపోయింది. నీనా గుప్తా తన పాత్రలో మంచి ప్రదర్శన చేసింది. మెయిన్ గా ఆమె కామిక్ టైమింగ్, కుమార్తెతో కెమిస్ట్రీ, ప్రతిదీ నీనా గుప్తా అద్భుతంగా చేసింది. సినిమా సెటప్, ప్రొడక్షన్ విలువలు మరియు హాలీవుడ్ షోలను కొన్నిటిని గుర్తుచేస్తాయి.

అన్నింటికంటే మించి దర్శకుడు రాసుకున్న నిజమైన మరియు కల్పిత సీన్స్ మరియు పాత్రల మధ్య సంబంధాన్ని ప్రదర్శించిన విధానం అద్భుతమైనది. రన్‌ టైమ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది.

ఏం బాగాలేదు :

ఈ సిరీస్ నేపథ్యం ఒక కాస్ట్లీ హాయ్-సొసైటీ షో. అయితే సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా అంతగా కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఈ సిరీస్ లో మంచి కథ గాని, బలమైన పాత్రలు గాని లేవు. ఇది కల్పిత పరిస్థితుల నుండి పుట్టిన సంఘటనల్లో నిజ జీవిత పాత్రల చుట్టూ ఈ సిరీస్ సాగినా.. పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక రెండు మెయిన్ పాత్రల జీవితాల గురించి రాసుకున్న ప్లే చాలామందికి బేసిగా అనిపించవచ్చు. అలాగే, సీజన్ ఒకటి చాలా సస్పెన్స్ లేదా డ్రామా లేకుండా సాధారణ నోట్లో సాగుతుంది. ఇక సహాయక తారాగణం పాత్రలు అంత గొప్పవి లేవు.

చివరి మాటగా :

మొత్తం మీద, ఈ ‘మసబా మసబా’ అనే ఈ వెబ్ సిరీస్ డిజైనర్ మసబా గుప్తా, ఆమె తల్లి నటి నీనా గుప్తా యొక్క నిజ జీవిత పాత్రల ఆధారంగా వచ్చిన ఒక కల్పిత వెబ్ సిరీస్. ఈ సిరీస్ లో గొప్ప నిర్మాణ విలువలు, చక్కటి సాంకేతిక పనితీరు ఉంది. అలాగే బాలీవుడ్‌లో ధనవంతులు వారి జీవితాల గురించి, ఈ సిరీస్ పూర్తి సంగ్రహావ లోకనం చేస్తుంది. కానీ, సిరీస్ లో గొప్ప కథకథానలు లేవు. అయినప్పటికీ, ప్రత్యేకమైన సెటప్ మరియు మసబా గుప్తా జీవితాన్ని ఈ షో ఆసక్తికరంగా చూపిస్తుంది. టైం ఉంటే ఒకసారి ఈ షోను చూడొచ్చు.

Rating: 3/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు