లాక్ డౌన్ రివ్యూ: ” సిన్ “- తెలుగు వెబ్ సిరీస్(ఆహా)

లాక్ డౌన్ రివ్యూ: ” సిన్ “- తెలుగు వెబ్ సిరీస్(ఆహా)

Published on Apr 23, 2020 11:57 PM IST

లాక్డౌన్ లో సినిమాలు మరియు వెబ్ సిరీస్ సమీక్షల సిరీస్‌ను కొనసాగిస్తూ, నేడు తెలుగు వెబ్ సిరీస్ సిన్ ని తీసుకోవడం జరిగింది.సిన్ వెబ్ సిరీస్ ను శరత్ మరార్ నిర్మించగా నవీన్ మేదరం దర్శకత్వం వహించారు. మార్చి 25 నుండి ఆహా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ నందు సిన్ అందుబాటులో ఉంది.

కథా నేపథ్యం:

ఆనంద్ (తిరువీర్), మహిళా సాధికారత విభాగంలో పనిచేస్తూ ఆడవారి పట్ల చాల గౌరవం గలవాడిగా ప్రవరిస్తూ ఉంటాడు. పైకి జెంటిల్ మెన్ లా కనిపించే ఆనంద్ నిజానికి ఒక స్త్రీ లోలుడు. అతను తన శారీరక సుఖం కోసం నందిత (దీప్తి సతి) ను వివాహం చేసుకుంటాడు. అతని నిజ స్వభావం ఆమె కొద్దిరోజుల లోనే తెలుసుకుటుంది. ఆనంద్ మరో అమ్మాయి నినాతో కూడా ఎఫైర్ పెట్టుకుంటాడు. మోసగాడైన ఆనంద్ కారణంగా సమస్యలలో చిక్కుకున్న నందిత, నైనా ల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది, వీరి ముగ్గురి కథ ఎలా ముగిసింది అనేది మిగతా కథ…

ఏం బాగుంది:

ప్రధాన పాత్రలో నటించిన తిరువీర్ తన రెండు భిన్న స్వభావాలు కలిగిన పాత్రలో అద్భుత నటన కనబరిచాడు. లోపల క్రూర స్వభావం కలిగి పైకి అమాయకుడుగా అద్భుతంగా నటించాడు. ప్రధాన కథాంశంలో వివాహం గురించి మరియు అమాయక బాలికలు వైవాహిక అత్యాచారాలను ఎలా ఎదుర్కొనాలి, మహిళల సాధికారత గురించి కొన్ని సన్నివేశాలు చాలా బాగా చూపించారు.ఇక ఈ వెబ్ సిరీస్ లో మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బీజీఎమ్ చాలా బాగుంది.

చివరి మాట:

మొత్తంగా వైవాహిక అత్యాచారం అనే అంశంతో తెరకెక్కిన సిన్ ఆకట్టుకుంటుంది. అడల్ట్ కంటెంట్ మోతాదు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ మెయిన్ రోల్స్ చేసిన నటుల పనితీరు చాలా బాగుంది. క్లైమాక్స్‌లోని ట్విస్ట్ మంచి అనుభూతిని పంచుతుంది. కానీ మొదటి నుండి కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చి ఉంటే ఇంకా ఆసక్తికరంగా ఉండేది. ఆకట్టుకోనే రన్‌టైమ్ మరియు అక్కడక్కగా ఆకట్టుకొనే సన్నివేశాలు ఉండడం వలన దీనిని ఓ సారి చూడవచ్చు.

123telugu.com Rating : 2.5/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు