పాటల సమీక్ష : ‘అల వైకుంఠపురములో’ – ఈ మధ్య కాలంలో బెస్ట్ సాంగ్స్ !

పాటల సమీక్ష : ‘అల వైకుంఠపురములో’ – ఈ మధ్య కాలంలో బెస్ట్ సాంగ్స్ !

Published on Jan 7, 2020 5:30 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ని సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కాగా జనవరి 12న ఈ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రస్తుతం చిత్రబృందం ఫుల్ ప్రమోషన్స్‌ ను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాలోని పాటలన్నింటినీ విడుదల చేశారు. మరి ఈ చిత్రం యొక్క ఫుల్ ఆడియో ఆల్బమ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

పాట 1 : ‘ఓ మై గాడ్ డాడీ…’

 

OMG Daddy

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న ‘అల వైకుంఠపురములో’ని సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కాగా జనవరి 12న ఈ సినిమాను ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రస్తుతం చిత్రబృందం ఫుల్ ప్రమోషన్స్‌ ను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాలోని పాటలన్నింటినీ విడుదల చేశారు. మరి ఈ చిత్రం యొక్క ఫుల్ ఆడియో ఆల్బమ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

 

Samajavaragamana

పాట 2: ‘సామజవరగమన’

 

‘అల వైకుంఠపురములో’ని ఆల్బమ్ లో ‘సామజవరగమన’ రెండో పాటగా వచ్చింది. థమన్ అద్భుతమైన స్వర కల్పనలో సిరివెనెల అందించిన గొప్ప సాహిత్యం అలాగే యంగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్ కూడా ఈ పాటను చాల అద్భుతంగా పాడారు. మెయిన్ గా వెస్ట్రన్ బీట్ కి క్లాసిక్ టచ్ ఇవ్వడం సూపర్ గా అనిపించింది. ఓవరాల్ గా ఈ సాంగ్ అల్లు అర్జున్ – తమన్ కెరీర్ లోనే గొప్ప సాంగ్ గా నిలిచిపోతుంది.

 

పాట 3: ‘బుట్ట బొమ్మా’

 

Butta Bomma

ఈ ఆల్బమ్‌లోని మూడవ పాట ఈ ‘బుట్ట బొమ్మా’ సాంగ్, ఇది కూడా స్టైలిష్ అండ్ క్లాసిక్ టచ్ తో ఆకట్టుకుంది. ‘బుట్ట బొమ్మా బుట్ట బొమ్మా.. నన్ను సుట్టు కుంటివే…. , జిందగీకే అట్టబొమ్మై అట్ట అంటుకుంటివే..’ అనే మంచి సాహిత్యంతో సాగే ఈ సాంగ్ ను అర్మాన్ మాలిక్ పాడగా, రామజోగయ్య శాస్త్రి చక్కటి సాహిత్యాని అందించారు. ఈ పాట కూడా సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్క్రీన్ మీద ఈ పాట సూపర్ స్టైలిష్ విజువల్స్ ఇంకా బాగా ఆకట్టుకుంటుంది.

 

Ala Vaikunthapuramlo

పాట 4: ‘అల వైకుంఠపురములో’

 

ఆల్బమ్‌లోని నాల్గవ పాటగా ఈ సాంగ్ ఉంది. కృష్ణ చైతన్య పాడిన ఈ టైటిల్ సాంగ్ కూడా చాలా సాంప్రదాయ నోట్‌లో మొదలవుతూ మరొక స్థాయికి తీసుకువెళ్ళింది. ఇక తమన్ ఇచ్చిన ట్యూన్ అద్భుతంగా ఉంది. మిగిలిన పాటలు లాగే ఈ పాట కూడా సూపర్ హిట్ గా నిలుస్తోంది.

 

పాట 5: ‘రాములో రాములా’

 

Ramulo Ramula

ఈ ఆల్బమ్ లో నాలుగో పాటగా వచ్చిన ‘రాములో రాములా’ కూడా భారీ స్థాయిలో ఆదరణ దక్కించుకుంది. ఇప్పటికీ శ్రోతల్ని బాగా అలరిస్తోంది. ఈ పాటతో చిత్ర సంగీత దర్శకుడు తమన్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. శ్యాం కాసర్ల రాసిన ఈ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి మరియు మంగ్లీ పాడారు. తమన్ అద్భుతమైన ట్యూన్ తో ఈ పాటను తీర్చిదిద్దారు. ఈ సాంగ్ కూడా సూపర్ హిట్ సాంగ్ గా నిలిచింది.

 

తీర్పు :-

ఈ మధ్య కాలంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన పాటలంటే ఖచ్చితంగా అనుమానం లేకుండా ‘అల వైకుంఠపురములో’ని సాంగ్సే అని చెప్పాలి. ఈ సినిమా నుండి వచ్చిన అన్ని పాటలు బ్రహ్మండంగా హిట్టయ్యాయి. సామజవరగమన నుండి రాములో.. రాములా, ఓ మైగాడ్ డాడీ, బుట్ట బొమ్మ ఇలా నాలుగు పాటలు నాలుగు రకాలుగా అలాగే టైటిల్ సాంగ్ కూడా అద్భుతంగా ఆకట్టుకున్నాయి. తమన్ తన కెరీర్ లోనే బెస్ట్ సాంగ్స్ ఇచ్చాడు. ప్రతి పాట ప్రత్యేకమైనదే. ఇలాంటి ఆల్బమ్ చాలా అరుదుగా వస్తుంటుంది. ఓవరాల్ గా ఈ పాటలు ఈ సినిమాని మరొక స్థాయికి తీసుకువెళ్ళాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు