పాటల సమీక్ష : డియర్ కామ్రేడ్

పాటల సమీక్ష : డియర్ కామ్రేడ్

Published on Jul 23, 2019 6:00 PM IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ బ్యూటీ రష్మిక మండన్న రెండవ సారి జంటగా రాబోతున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. కాగా ఈ సినిమా ఈ నెల 26న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాలోని పాటలన్నింటినీ విడుదల చేశారు. ‘డియర్ కామ్రేడ్’ ఆడియో హక్కులను సొంతం చేసుకున్న టి-సిరీస్ సంస్థ జ్యూక్ బాక్స్‌ ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. జస్టిన్ ప్రభాకరన్ సంగీత సారథ్యంలో విడుద‌లైన ఈ చిత్రం యొక్క ఫుల్ ఆడియో ఆల్బమ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

1: కామ్రేడ్ యాంథమ్ డియర్ కామ్రేడ్
సింగర్స్: విజయ్ దేవరకొండ, స్టోనీ సైకో (డోపియోడెలిజ్), మెక్ విక్కీ
లిరిక్స్: చైతన్య ప్రసాద్
కామ్రేడ్ యాంథమ్ డియర్ కామ్రేడ్ సింగర్స్

Analysis: ఈ పాట ఆల్బమ్ లో మొదటి పాటగా ఉంది. విజయ్ దేవరకొండ, స్టోనీ సైకో (డోపియోడెలిజ్), మెక్ విక్కీలు ఈ పాటను పాడారు. చైతన్య ప్రసాద్ లిరిక్స్ కూడా ప్రేక్షకుడిని బాగా ఆకట్టుకుంటాయి. ఇక జస్టిన్ ప్రభాకరన్ ట్యూన్ పర్వాలేదనిపిస్తోంది. మొత్తం మీద ఈ సినిమా విజువల్ గా చూసిన తర్వాత ఇంకా బాగా అనిపిస్తోంది.

Yetu Pone

2: ఎటు పోనే
సింగర్స్: కాళభైరవ
లిరిక్స్: కెకె

Analysis:  ఈ పాట ఆల్బమ్ లో సెకెండ్ పాటగా ఉంది. ప్రేమికుడి బాధను వర్ణించే హృదయ విదారకమైన పాట ఇది. ఈ పాటలో గాయకుడు కాళభైరవ ఆలాపన విధానం అలాగే కెకె సాహిత్యం ప్రేక్షకుడి పై లోతైన ప్రభావాన్ని చూపిస్తోంది. ఇక ట్యూన్ విషయానికి వస్తే జస్ట్ ఓకే అనిపిస్తోంది. ఈ పాటలో విజయ్ నటన ప్రత్యేకమైనదని చెప్పొచ్చు. విజువల్ గా చూసిన తర్వాత ఈ పాట ఇంకా బాగా క్లిక్ అవుతుంది.

 

3: కడలల్లే
సింగర్స్: సిద్ శ్రీరామ్, ఐశ్వర్య రవిచంద్రన్
లిరిక్స్: రెహ్మాన్ Kadallale

Analysis:  ఈ చిత్రంలోని ఆల్బమ్ లో ఈ సాంగ్‌ మూడో సాంగ్. ‘కడలల్లె వేచె కనులే.. కదిలేను నదిలా కలలే’ అంటూ సాగే రొమాంటిక్‌ పాట ఇది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం.. రెహ్మాన్ సాహిత్యం.. సిద్ శ్రీరామ్ – ఐశ్వర్య రవిచంద్రన్ ఆలాపన ఈ సాంగ్ కి ప్రత్యక ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా జస్టిన్ ప్రభాకరన్ స్వరపరిచిన బాణీ అద్భుతంగా వుంది.

4: నీ నీలి కన్నుల్లోనా
సింగర్స్: గౌతమ్ భరద్వాజ్ వి
లిరిక్స్: రెహ్మాన్ Nee Neeli Kannullona

Analysis:  ఈ పాట ఆల్బమ్ లో నాలుగవ పాటగా ఉంది. నీ నీలి కన్నుల్లోన అనే పల్లవితో సాగుతుంది ఈ సాంగ్. అమ్మాయిని ప్రకృతితో పోలుస్తున్న ఈ పాట వినసొంపుగా ఉన్నది. పదాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. తమిళ స్వరకర్త జస్టిన్ ప్రభాకరన్ ఈ పాటతో బాగా స్కోర్ చేస్తారు, ఇది చాలాసార్లు విన్న తర్వాత మనకు ఇంకా బాగా నచ్చుతుంది.

5: ఓ కలలా కథలా
సింగర్స్: సత్య ప్రకాశ్, చిన్మయి శ్రీపాద
లిరిక్స్: రెహ్మాన్ O Kalala Kathala

Analysis:  ఆల్బమ్ లో ఐదొవ పాటగా వస్తోన్న ఈ సాంగ్ ను సింగర్స్ సత్య ప్రకాశ్, చిన్మయి శ్రీపాద పాడారు. అయితే పాట మాత్రం ఓ నీరసమైన టోన్ లో మొదలవుతుంది, కానీ పాట సగం చేరుకున్న తర్వాత, పాటలోని కొన్ని విషయాలు చాలా ఆసక్తికరంగా మారతాయి. ఈ పాట ఒక చిరస్మరణీయ మాంటేజ్ సాంగ్ చెప్పొచ్చు, హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీని ఈ సాంగ్ హైలెట్ చేసేలా ఉంది.

6: మామా చూడరో
సింగర్స్: నరేష్ అయ్యర్
లిరిక్స్: రెహ్మాన్ Maama Choodaro

Analysis:  ఆల్బమ్ లో ఈ మామా చూడరో పాట ఆరువ పాటగా ఉంది. మంచి అనుభూతిని కలిగి ఉన్న వివాహ పాట ఇది. ఈ పాటకు గుండె మరియు ఆత్మ నరేష్ అయ్యర్ ఆలాపనే అని చెప్పాలి. ఇక ట్యూన్ విషయానికి వస్తే.. కేవలం సగటు ట్యూన్ లానే అనిపిస్తోంది. హీరోహీరోయిన్ల మధ్య చిరస్మరణీయ జ్ఞాపకాలను తెలియజేసేలా ఉంది ఈ పాట సాహిత్యం.

 

7:గిరా గిరా
సింగర్స్: గౌతమ్ భరద్వాజ్ వి, యామిని ఘంటసాల
లిరిక్స్: రెహ్మాన్Gira Gira

Analysis:  ఈ సినిమాలో ఈ ‘గిర గిర గిర తిరగలిలాగా .. తిరిగి అరిగిపోయినా దినుసే నలగాలేదుగా.. అంటూ సాగే ఈ పాట ఏడువ పాటగా ఉంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం .. రెహ్మాన్ సాహిత్యం .. గౌతమ్ భరద్వాజ్ – యామినీ ఘంటసాల ఆలాపన మనసుకు పట్టేలా వున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మెలోడియస్ సాంగ్స్ లో ఇదొకటని చెప్పొచ్చు.

8: క్యాంటీన్ సాంగ్
సింగర్స్: కార్తీక్ రొద్రిగ్వేజ్
లిరిక్స్: రెహ్మాన్ Canteen Song

Analysis:  ఈ క్యాంటీన్ సాంగ్ ఆల్బమ్ లో లాస్ట్ సాంగ్ గా వస్తోంది. క్యాంటీన్‌లో ప్రేమ‌క‌థ‌ల్ని గుర్తు చేస్తూ సాగిన ఈ పాట‌లోని ప‌దాలు, బాణీ… యువ‌త‌రానికి న‌చ్చేలా ఉన్నాయి. కొన్నాళ్ల పాటు. ఒక్కో పాట‌నీ ఒక్కో ర‌కంగా డిజైన్ చేశాడు ద‌ర్శ‌కుడు. ఈ పాటలే డియ‌ర్ కామ్రేడ్ కి స‌గం బ‌లం అనిపిస్తోంది.

 

తీర్పు:-

మొత్తం మీద, ‘డియర్ కామ్రేడ్’ ఆల్బమ్‌ లో ఎనిమిది రకాల పాటలు ఉన్నాయి. సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ రొమాంటిక్ సాంగ్ లను అద్భుతంగా కంపోజ్ చేశాడు. నీ నీలి కన్నుల్లోనా, గిరా గిరా, ఓ కలలా కథలా మరియు నీ నీలి కన్నుల్లోనా సాంగ్స్ పెద్ద హిట్ అవుతాయి. విజయ్ దేవరకొండ మరియు రష్మిక కెమిస్ట్రీ కూడా పాటల్లో బాగానే హైలెట్ అయ్యేలా ఉంది. రాబోయే రోజుల్లో ఈ పాటలు మరింతగా ప్రాచుర్యం పొందుతాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు