హిందీ ‘ఖైదీ’ పరిస్థితి ఏమిటి ?

హిందీ ‘ఖైదీ’ పరిస్థితి ఏమిటి ?

Published on May 24, 2020 11:45 PM IST

దక్షిణాది పరిశ్రమల సినిమాల పై ఈ మధ్య ఆసక్తి చూపిస్తున్నారు బాలీవుడ్ నిర్మాతలు. తమిళ సినిమా ‘ఖైదీ’ తెలుగులో ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో అందరికీ తెలుసు. అందుకే ఈ రీమేక్ చిత్రంలో స్టార్ హీరో అజయ్ దేవగణ్ అంగీకరించి వెంటనే డేట్స్ ఇచ్ఛేసిన సంగతి కూడా తెలిసిందే.

కాగా తాజాగా బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం అక్టోబర్ లాస్ట్ వీక్ నుండి ఈ రీమేక్ మూవీ షూటింగ్ ను మొదలుపెట్టాలని చిత్రబృందం భావిస్తోంది. 2021 ఫిబ్రవరి 12న ఈ రీమేక్ విడుదలవుతుందని కూడా అజయ్ దేవగన్ అనౌన్స్ కూడా చేశారు. కానీ కరోనా నేపథ్యంలో రిలీజ్ డేట్ మారే అవకాశం ఉంది.

ఇక కేవలం హీరో మీద, మాస్ ఎంలిమెంట్స్, ఫాధర్, డాటర్ ఎమోషన్ మీదే నడిచిన ఈ చిత్ర కథ హిందీ ప్రేక్షకులకి కొత్త అనుభూతిని అందిస్తుందని భావించిన రిలయన్స్ ఎంటెర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు