సీనియర్ డైరెక్టర్ ప్లేస్ లో పూరి ?

Published on May 25, 2020 12:01 am IST


డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ బాలయ్య కోసం ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాస్తున్నాడట. ఇప్పటికే పూరి, బాలయ్యకి ఫోన్ లోనే కథ వినిపించాడని బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. బోయపాటి సినిమా తరువాత, బాలయ్య – బి.గోపాల్ కాంబినేషన్ లో సినిమా రావాలి. అయితే స్క్రిప్ట్ సెట్ అవ్వక ఈ సినిమా క్యాన్సల్ అయింది. దాంతో పూరి జగన్నాథ్- బాలయ్య సినిమా ముందుకు వచ్చే అవకాశం ఉంది.

మొత్తానికి బి.గోపాల్ ప్లేస్ లో పూరి జగన్నాథ్ సినిమా చేయబోతున్నాడు. ‘బాలయ్య – గోపాల్’లది సూపర్ హిట్ కాంబినేషన్. బాలయ్య ఫ్యాన్స్ కోసమైనా ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తే బాగుంటుంది. ఇక ప్రస్తుతం బాలయ్య, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పై అభిమానుల్లో బాగా ఆసక్తి ఉంది. ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More