ఈ సినిమా హిట్ అయితేనే కెరీర్ నిలబడేది !

Published on May 24, 2020 2:00 am IST

యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌ గత కొన్ని సినిమాల నుండి వరుస ప్లాప్ లతో బాక్సాఫీస్ వద్ద పూర్తిగా డీలా పడిపోయాడు. ఎలాంటి సపోర్ట్ లేకుండా చాల స్పీడ్ గా ఎదిగిన రాజ్ తరుణ్.. ప్రస్తుతం రేసులో వెనుక పడిపోయాడు. అయితే ప్రసుతం కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో ‘ఒరేయ్ …బుజ్జిగా’ అనే సినిమా రాబోతుంది. ఈ సినిమా పై రాజ్ తరుణ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ అయితేనే రాజ్ తరుణ్ కెరీర్ సజావుగా సాగుతుంది.

కాగా ‘గుండె జారి గ‌ల్లంత‌య్యిందే’ సినిమాతో హిట్ డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొండా విజయ్ కుమార్ కెరీర్ కి కూడా ఈ సినిమా చాల కీలకం కానుంది. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్ నటిస్తుంటే.. హెబ్బా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధా మోహ‌న్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాజ్ తరుణ్ కనీసం ఈ సినిమాతోనైనా హిట్ అందుకోవాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :

More