రవితేజ ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి సాలిడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న యంగ్ హీరో.!

రవితేజ ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ లోకి సాలిడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న యంగ్ హీరో.!

Published on Aug 9, 2022 9:00 AM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా టాలీవుడ్ లో తనదైన సుస్థిర స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. మరి ఇప్పుడు రవితేజ సోదరుని కొడుకు టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు. మరి తానే మాధవ్ భూపతి రాజు కాగా తన ఫస్ట్ సినిమానే సాలిడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా అర్ధం అవుతుంది.

మరి ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ కథ అందిస్తుండగా యంగ్ దర్శకుడు లుదీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ ఈ సినిమాకి వర్క్ చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ అయినటువంటి రుబల్ షెకావత్ నటిస్తుండగా మేకర్స్ ఈ చిత్రాన్ని ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా ప్లాన్ చేస్తున్నారు.

అలాగే ఈ చిత్రానికి “ఏయ్ పిల్లా” అని టైటిల్ ఫిక్స్ చేసి మెయిన్ లీడ్ పై రిలీజ్ చేసిన పోస్టర్ బాగుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత నల్లమలుపు బుజ్జి తన బ్యానర్ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాణం వహిస్తుండగా మరిన్ని వివరాలు రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు