స్టేజ్ 3లో ఉన్న అధీరా ఆరోగ్యం.!

స్టేజ్ 3లో ఉన్న అధీరా ఆరోగ్యం.!

Published on Aug 12, 2020 12:18 PM IST

బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ఆరోగ్యానికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి పలు వారీహాలు బయటకు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తనకు కరోనా లేదన్న వార్త ఆ మధ్య కాస్త ఉపశమనం కలిగించినా ఇప్పుడు ఊపిరితిత్హుల క్యాన్సర్ తో బాధపడుతున్నారన్న వార్త సినీ వర్గాలను విస్మయానికి గురి చేసింది. అయితే ఇప్పుడు సంజయ్ స్టేజ్ 3 లంగ్ క్యాన్సర్ తో బాధ పడుతున్నారట.

అందుకే ఆయన్ను ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా అమెరికాకు తరలించినట్టు తెలుస్తుంది. ఇటీవలే 61 లోకి అడుగు పెట్టిన ఈ వెర్సిటైల్ నటుడు ఇప్పుడు పలు చిత్రాలు సహా ఇండియా వైడ్ ఎంతో క్రేజ్ తెచ్చుకున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ “కేజీయఫ్ చాప్టర్ 2” లో నటిస్తున్నారు. ఇటీవలే అధీరా గా ఆయన ఫస్ట్ లుక్ కు కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. సంజయ్ ఆరోగ్యం కుదుటపడి యథావిధిగా మళ్ళీ షూటింగ్స్ లో పాల్గొని మనల్ని ఎంటర్టైన్ చెయ్యాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు