సమీక్ష : సవారి – అక్కడక్కడా ఆకట్టుకునే బోల్డ్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ !

సమీక్ష : సవారి – అక్కడక్కడా ఆకట్టుకునే బోల్డ్ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ !

Published on Feb 8, 2020 3:04 AM IST
Savaari review

విడుదల తేదీ : ఫిబ్రవరి 07, 2020

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు :  నందు, ప్రియాంక శర్మ, శ్రీకాంత్ రెడ్డి,శివకుమార్

దర్శకత్వం : సాహిత్ మోత్కూరి

నిర్మాత‌లు : సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కుదితి

సంగీతం : శేఖర్ చంద్ర

సినిమాటోగ్రఫర్ : మొనీష్ భూపతిరాజు

ఎడిటర్ : సంతోష్ మేనం

నటుడు నందు హీరోగా ప్రియాంక శర్మ హీరోయిన్ గా “బంధం రేగడ్” అనే షార్ట్ ఫిలిం తో 2018లో ప్రతిష్టాత్మక “సైమా” బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డు అందుకున్న సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “సవారి” శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రం ట్రైలర్ మరియు పాటలతో ఆకట్టుకొని మంచి బజ్ ను సంతరించుకుంది.మరి ఈ చిత్రం వెండితెర ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్ష లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

 

కథ :

రాజు (నందు) స్లమ్ ఏరియాలో ఉంటూ గుర్రాన్ని నడుపుకునే దిగువు తరగతి పర్సన్. తన వంశపారంపర్యంగా వచ్చే సవారి వృత్తిని చేసుకుంటూ తన జీవనం సాగిస్తుంటాడు. ఈ నేపథ్యంలో తన గుర్రం (బాద్షా) అంటే తనకు ప్రాణం. అయితే ఆ ప్రాణానికి ఓ సమస్య ఉంటుంది. ఆ గుర్రానికి ఉన్న సమస్యను తీర్చడానికి కష్టపడి డబ్బులు పోగేస్తుంటాడు. అలాగే భాగీ (ప్రియాంక శర్మ)ను ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ కొన్ని ఊహించని పరిణామాల రీత్యా ఓ రోజు బాద్షా మిస్సయ్యిపోతుంది. అలా తాను ఎంతగానో ప్రేమించే బాద్షా ఎందుకు మిస్సయ్యింది? దానికి గల కారకులు ఎవరు? అది దొరికిందా లేదా? అసలు భాగీ రాజు నఎంతగా ప్రేమిస్తోంది ? వీరి ప్రేమకు ఉన్న అడ్డు ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెర మీద చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

నటునిగా సపోర్టింగ్ రోల్స్ మరియు హీరోగా నందు ఇప్పటి వరకు చాలా సినిమాలనే చేసారు. కానీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే సినిమాగా మాత్రం ఏ ఒక్కటీ అంత స్కోప్ తీసుకురాలేకపోయింది. కానీ ఈ చిత్రం మాత్రం నందు కెరీర్ కు ఆ ఇంపాక్ట్ ను ఖచ్చితంగా తీసుకొస్తుంది అని చెప్పాలి. ఇప్పటి వరకు స్టైలిష్ గా అనేక కోణాల్లో కనిపించిన నందు ఈ చిత్రం ద్వారా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. తన నటన ఈ చిత్రానికి మేజర్ హైలైట్ అని చెప్పాలి. అమాయక పాత్రలో కనిపించి చిన్న చిన్న మ్యానరిజమ్స్ తో తాను కనబర్చిన నటనా తీరు చాలా బాగుంది. అలాగే పలు కీలకమైన ఎమోషనల్ ఎపిసోడ్స్ లో సినిమా చూసే ప్రేక్షకునికి కూడా ఆ ఫీల్ ను తీసుకొచ్చే విధంగా సినిమా మొత్తం తానే నడిపించాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక హీరోయిన్ ప్రియాంక శర్మ కూడా మంచి నటనను కనబర్చింది. అలాగే సినిమా అంతా మంచి పక్కా మాస్ అమ్మాయిగా కనిపించి తన చక్కని హావభావాలతో ఏ సీన్ కు ఎలా కావాలో అలా తనని తాను మలచుకున్న విధానం బాగుంది. ముందే హిట్టయిన రెండు ట్రాక్స్ నీ కన్నులు సాంగ్ మరియు ఉండిపోవా పాటలు విజువల్ గా కూడా అంతే స్థాయిలో బాగున్నాయి.

ఇంకా విలన్ రోల్ లో కనిపించిన శ్రీకాంత్ రెడ్డి ఒక పక్క విలజనిజం మరో పక్క దానితోనే కామెడీ యాంగిల్ బాగా క్యారీ చేసారు.అతనికి మరియు అతని గ్యాంగ్ మధ్య వచ్చే ప్రతీ కామెడీ ట్రాక్ బాగుంది. దీనిని దర్శకుడు బాగా ప్రిపేర్ చేసుకున్నారు. అలాగే ఇతర పాత్రల్లో నటించిన శివ కుమార్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.

 

మైనస్ పాయింట్స్ :

సినిమాలో స్టోరీ పాయింట్ అలాగే హీరోహీరోయిన్ల పాత్రలకు మధ్య వ్యతాస్యం ఆకట్టుకున్నా.. కథాకథనాల పరంగా మాత్రం సినిమా ఆకట్టుకునే విధంగా సాగలేదు. ఫేక్ ఎమోషన్స్ తో లాజిక్ లేని స్క్రీన్ ప్లేతో సినిమా సాగింది. అయితే మొదటి భాగంలో కొన్ని సీన్స్ సరదాగా సాగుతూ పర్వాలేదనిపించినప్పటికీ.. సినిమాలో బలమైన కాన్ ఫిల్ట్ మిస్ అయింది. పైగా సెకెండ్ హాఫ్ మొత్తం హీరోహీరోయిన్లు మధ్య కొన్ని లవ్ సీన్స్ అనవసరంగా సాగతీశారు.

దీనికి తోడు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత మరి ఎక్కువడంతో కథలో సహజత్వం లోపించింది. స్లమ్ ఏరియాలో ఉంటూ ఒక గుర్రం నడుపుకునే కుర్రాడు, రిచ్ క్లాస్ అమ్మాయితో ప్రేమలో పడటం, చిన్న చిన్న మేలో డ్రామా ఇన్సిడెంట్ల కారణంగా ఆ ప్రేమను ఆ అమ్మాయి కూడా ఫీల్ అవ్వడం, వీటికి తోడు వీళ్ళద్దరూ ప్రేమకు ఒక విలన్.. అతని వల్ల వీళ్ళ లవ్ స్టోరీలో సమస్యలు రావడం ఇలా బలం లేని సీన్స్ తో సాగడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.

అయితే ఈ సన్నివేశాల్లో కూడా దర్శకుడు కొన్ని చోట్ల మంచి హ్యూమర్ ను పండించాడు. మొత్తానికి దర్శకుడు తానూ అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగానే ఎలివేట్ చేసినా.. కొన్ని చోట్ల నిరాశ పరుస్తాడు. కంటెంట్ పరంగా ఇంకా మంచి భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకుడు సినిమాను సింపుల్ గా ముగించడం అంతగా రుచించదు.

 

సాంకేతిక విభాగం :

ముందుగా చెప్పుకున్నట్లుగానే దర్శకుడు మంచి కాన్సెప్ట్ ని తీసుకున్నారు. అయితే ఆ కాన్సెప్ట్ ని తెర మీద చూపెట్టడంలో కొంత తడబాటు పడ్డాడు. అయినప్పటికీ కొన్ని కామెడీ అండ్ లవ్ సీక్వెన్స్ లో మరియు క్లైమాక్స్ అండ్ కొన్ని కీలక సన్నివేశాలతో ఆకట్టుకున్నాడు. మొనీష్ భూపతిరాజు కెమెరా పనితనం మాత్రం ఇంప్రెస్ అయ్యేలా ఉంది. ఆయన తీసిన విజువల్స్, కొన్ని షాట్స్ చాలా బాగున్నాయి. ఇక సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అందించిన సంగీతం బాగుంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో నేపధ్య సంగీతం బాగా ఆకట్టుకుంది. ఎడిటర్ గా పనిచేసిన సంతోష్ మేనం పనితనం కూడా ఆకట్టుకుంది. నిర్మాతలు సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి కుదితి నిర్మాణ విలువులు కూడా బాగున్నాయి.

 

తీర్పు :

‘సవారి’ అంటూ బోల్డ్ స్లమ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం కాన్సెప్ట్ పరంగా అలాగే కొన్ని కామెడీ సన్నివేశల పరంగా మరియు క్లైమాక్స్ అలాగే కొన్నిచోట్ల డైలాగ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ తో సినిమా అక్కడక్కడా బాగానే ఆకట్టుకుంటుంది. కాకపోతే సినిమా మాత్రం పూర్తి స్థాయిలో ఆసక్తికరంగా సాగదు. కథనం సింపుల్ గా ఉండటం, సినిమాలో కొన్ని కీలకమైన సీన్స్ కు సరైన లాజిక్స్ లేకపోవడం, అన్నిటికి మించి సినిమాలో బలమైన సంఘర్షణ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి బలహీనుతలుగా నిలుస్తాయి. అయితే హీరోహీరోయిన్స్ మధ్య వచ్చే లవ్ సీన్స్, విలన్ గ్యాంగ్ కామెడీ ట్రాక్ అలాగే నందు నటన సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి. మరి ఈ చిత్రం బాక్సాపీస్ దగ్గర ఎంతవరకు నిలబడుతుందో చూడాలి.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు