బాక్సాఫీస్ దగ్గర స్టడీ వసూళ్లతో “సీతా రామం” హవా.!

బాక్సాఫీస్ దగ్గర స్టడీ వసూళ్లతో “సీతా రామం” హవా.!

Published on Aug 9, 2022 2:03 PM IST


గత వారం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయినటువంటి చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా టాలెంటెడ్ నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చిత్రం “సీతా రామం” కూడా ఒకటి. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి అంచనాలు ప్రమోషన్స్ మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మరి అద్భుత విజయాన్ని నమోదు చేసి టాలీవుడ్ కి ఊపిరి పోసింది.

ఇక ఈ చిత్రం అయితే మొదటి వారాంతం తో పాటుగా సోమవారం కూడా తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు నమోదు చేస్తూ చాలా స్టడీ గా వసూళ్లతో దూసుకెళ్తుంది. లేటెస్ట్ గా ఓవర్సీస్ లో అయితే మొదటి సోమవారం 80 వేలకి పైగా డాలర్స్ ని రాబట్టి రియల్ సక్సెస్ గా నిలవగా కృష్ణ జిల్లాలో 19 లక్షల 90 వేల షేర్ ని మూడో రాబట్టగా నాలుగో రోజు సోమవారం 10 లక్షలకు పైగా షేర్ ని అందుకొని టోటల్ గా 60.36 లక్షల షేర్ ని అందుకుంది. దీనితో ఈ చిత్రం హవా అద్భుతంగా కొనసాగుతుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు