మొదటిసారి ట్రై చేస్తున్నందుకు కోటిన్నర తీసుకుంటున్న తమన్నా ?

మొదటిసారి ట్రై చేస్తున్నందుకు కోటిన్నర తీసుకుంటున్న తమన్నా ?

Published on Sep 21, 2020 10:54 PM IST

హీరో నితిన్ తన తర్వాతి సినిమాగా హిందీ సూపట్ హిట్ మూవీ ‘అంధాధూన్’ను తెలుగులోకి రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. చాలా నెలల నుండి ప్లాంయింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఇటీవలే ఒక కొలిక్కి వచ్చింది. నిజానికి హిందీ వెర్షన్లో ఉండే పాత్రలు తక్కువే. అయినా ప్రతి ఒక్కటీ ముఖ్యమైన పాత్రే. ఆ పాత్రల బిహేవియర్, వాటిని మలచిన తీరు ఆకట్టుకునేలా ఉంటుంది. ఆ పాత్రల్లో ప్రధానమైనది ఫీమేల్ నెగెటివ్ రోల్. ఆ పాత్రే కథకు ప్రధాన ఆధారం. అందులో తబీ నటన అందరికీ బాగా నచ్చింది. ఆ సినిమా విజయంలో టబు పెర్ఫార్మెన్స్ ప్రముఖ పాత్ర పోషించింది.

అందుకే తెలుగులో కూడా టబు తరహాలో పాత్రకు న్యాయం చేయగలిగిన నటి కోసం తీవ్రంగా వెతికిన చిత్ర టీమ్ చివరకు మిల్కీ బ్యూటీ తమన్నాను ఫైనల్ చేశారు. ఇన్నాళ్లు తమన్నా పెద్ద సినిమాలు,ప్రధాన కథానాయిక, ప్రత్యేక గీతాలు, సైరా, బాహుబలి లాంటి చిత్రాల్లో వెయిట్ ఉన్న సహనాతి పాత్రలు చేశారు కానీ ఏనాడూ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసింది లేదు. అందుకే మొదట్లో తటపటాయించిన ఆమె చివరకు సినిమాకు సైన్ చేశారట.

ఈ చిత్రం కోసం ఆమె భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తోంది. సుమారు కోటిన్నర వరకు ముట్టజెబుతున్నారట నిర్మాతలు. ఇన్నేళ్ల కెరీర్లో మొదటిసారి నెగెటివ్ పాత్రతో ప్రయోగం చేయనుండటం వలనే తమన్నా ఇంత భారీ మొత్తం ఛార్జ్ చేసి ఉండవచ్చు. ఇక చిత్రంలో నితిన్ జోడీగా నభా నటేష్ నటించనుంది. ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నారు. నవంబర్ నుండి రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు