చైతూ “థాంక్యూ” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్!

చైతూ “థాంక్యూ” ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Aug 9, 2022 1:32 PM IST


అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ థాంక్యూ. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో విఫలం అయ్యింది. అయితే ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం ఆగస్ట్ 11, 2022 న డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకి రానుంది.

తాజాగా ఇందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు. అక్కినేని నాగ చైతన్య తదుపరి బాలీవుడ్ చిత్రం లాల్ సింగ్ చద్దా లో కనిపించనున్నారు. ఈ చిత్రం లో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు