డాషింగ్ డైరెక్టర్ కథ ఆ స్టార్ కోసమేనట ?

డాషింగ్ డైరెక్టర్ కథ ఆ స్టార్ కోసమేనట ?

Published on Apr 1, 2020 10:30 PM IST

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాన్నాళ్లకు ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్నే నమోదు చేశాడు. ఆ సక్సెస్ ఇచ్చిన కిక్ తో ప్రస్తుతం క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా దెబ్బకు అందరూ లాక్ డౌన్ లో ఉన్నారు. అయితే పూరి మాత్రం ఈ ఖాళీ సమయంలో ఓ స్టార్ హీరో కోసం ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాస్తున్నట్లు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఈ విరామం తనకు తాజాగా ఆలోచించడానికి అలాగే భిన్నమైన కథలను వ్రాయడానికి అద్భుతమైన అవకాశం అని పూరి చెప్పుకొచ్చాడు. అయితే పూరి కథ రాస్తోంది బాలయ్య కోసమే అని తెలుస్తోంది. గతంలో పూరి బాలయ్యతో సినిమా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే బాలయ్య – పూరి కాంబినేషన్‌లో ‘పైసా వసూల్’ చిత్రం వచ్చింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ఆ సినిమాలో బాలయ్యను చాల కొత్తగా చూపించాడు పూరి. అందుకే పూరితో మరో సినిమా చేయడానికి తానూ ఎప్పుడూ రెడీనే అని ఆ మధ్య బాలయ్య కూడా చెప్పుకొచ్చాడు. మొత్తానికి బోయపాటి శ్రీను – బాలయ్య సినిమా తర్వాత, పూరి – బాలయ్య సినిమా ఉంటుందట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు