వరుణ్ తేజ్ తో టాలెంటెడ్ డైరెక్టర్ ?

వరుణ్ తేజ్ తో టాలెంటెడ్ డైరెక్టర్ ?

Published on Mar 8, 2021 4:29 PM IST

భీష్మ సినిమాతో తన ఖాతాలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న వెంకీ కుడుముల మెగాస్టార్ ని కలిసి ఓ కథ వినిపించారని.. వెంకీ చెప్పిన కథ నచ్చడంతో వెంకీతో ప్రాజెక్ట్ పట్ల చిరు కూడా సానుకూలంగా ఉన్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా వెంకీ వరుణ్ తేజ్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇప్పటికే వరుణ్ కోసం స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడని.. వరుణ్ కి కూడా కథ బాగా నచ్చిందని తెలుస్తోంది.

మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు గాని ఫిల్మ్ సర్కిల్స్ లో మాత్రం ఈ న్యూస్ బాగానే వైరల్ అవుతుంది. కాగా భీష్మ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో వెంకీ తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. వెంకీ – వరుణ్ ల కాంబినేషన్ పై మంచి అంచనాలు ఉంటాయి. మరి వీరి సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు