ఆడియో సమీక్ష : నాన్నకు ప్రేమతో – డిఫరెంట్ ట్యూన్స్, సూపర్బ్ లిరిక్స్

ఆడియో సమీక్ష : నాన్నకు ప్రేమతో – డిఫరెంట్ ట్యూన్స్, సూపర్బ్ లిరిక్స్

Published on Dec 28, 2015 9:14 PM IST

nannaku-prematho1
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’. పూర్తి ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ సినిమాకి సుకుమార్ డైరెక్టర్. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో నిన్నే ఘనంగా రిలీజ్ అయ్యింది. ఎన్.టి.ఆర్ – దేవీశ్రీ కాంబినేషన్ లో వచ్చిన 5వ సినిమానే నాన్నకు ప్రేమతో. మొత్తం 5 పాటలున్న ఈ ఆల్బమ్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం..

 

011. పాట : ఫాలో ఫాలో
గాయకుడు : ఎన్.టి.ఆర్
సాహిత్యం : దేవీశ్రీ ప్రసాద్

నాన్నకు ప్రేమతో ఆల్బంలో వచ్చే మొదటి సోలో సాంగ్ ఫాలో ఫాలో.. మన హీరో ఎన్.టి.ఆర్ తనకు నచ్చిన అమ్మాయి ప్రేమ కోసం తన వెంట పడుతూ తను ఎక్కడికి వెళ్ళినా ఫాలో అవుతూనే ఉంటా సాగే ఈ పాటకి దేవీశ్రీ ప్రసాద్ చాలా బాగా రాసాడు. ఎంతలా అంటే వినగానే అందరూ ఈ లైన్స్ హమ్ చేసేలా రాసాడు. ఇకపోతే ఈ సాంగ్ కి ఉన్న ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఎన్.టి.ఆర్ ఈ పాటని పాడడమే.. ఎన్.టి.ఆర్ ఈ పాటని చాలా బాగా పాడాడు, తన వాయిస్ కాకుండా వేరే ఎవరి వాయిస్ ఈ సాంగ్ కి సెట్ అవ్వదు అనేలా ఈ పాటని పాడారు. ఇకపోతే దేవీశ్రీ కీ బోర్డ్ సౌండింగ్ తో సాంగ్ ని మొదలు పెట్టి ఆ ఆ తర్వాత మ్యూజిక్ ని లో పిచ్ లోకి తీసుకెళ్ళి ‘ఐ వాన ఫాలో ఫాలో ఫాలో యు’ అనే హమ్ తో సాంగ్ స్టార్ట్ చేయడం బాగుంది. ఆ తర్వాత స్నేర్ డ్రమ్ మరియు డ్రమ్ సెట్ ద్వారా కంపోజ్ చేసిన వెస్ట్రన్ మ్యూజిక్ వినడానికి చాలా బాగుంది. ఈ సాంగ్ ఆల్బంలో వినగానే పిచ్చ పిచ్చగా నచ్చేసే సాంగ్. అలాగే ఈ సాంగ్ టీజర్ ని బట్టి ఆన్ స్క్రీన్ విజువల్స్ మరియు ఎన్.టి.ఆర్ స్టెప్స్ వలన ఇంకా బాగా నచ్చుతుందని ఆశించవచ్చు.

 

2. పాట : నా మనసు నీలో02
గాయనీ గాయకులు : దేవీశ్రీ ప్రసాద్, షర్మిల
సాహిత్యం : భాస్కర భట్ల

క్రేజీ ఎలక్ట్రిక్ గిటార్ సౌండ్ కి ఇంగ్లీష్ వర్డ్స్ తో సాగే లైన్స్ ని ఓ హస్కీ లేడీ వాయిస్ తో పాడించిన ఈ పాట ఆల్బంలో వచ్చే మొదటి డ్యూయెట్ సాంగ్.. హీరో – హీరోయిన్ ఒకరికి ఒకరు తమ ప్రేమని వ్యక్తపరిస్తూ భాస్కర భట్ల రాసిన ఈ పాటలో సాహిత్యం వినడానికి చాలా బాగుంటుంది. ఈ పాటలో స్పెషాలిటీ అబ్బాయి వాయిస్ మొత్తం తెలుగులో ఉంటే, లేడీ వాయిస్ మాత్రం ఇంగ్లీష్ లో ఉంటుంది. దేవీశ్రీ ప్రసాద్ ఈ పాటకి చాలా లైవ్లీ ఫీలింగ్ తీసుకొచ్చాడు. మధ్య మధ్యలో ఇంగ్లీష్ లైన్స్ పాడిన షర్మిల వాయిస్ చాలా హస్కీగా ఉంటూ సాంగ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ఇక దేవీశ్రీ ఎలక్ట్రిక్ గిటార్ సౌండ్ తో ఈ పాటని స్టార్ చేసి ఆ తర్వాత స్లో పిచ్ డ్రమ్స్ తో బాగా మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా పల్లవి తర్వాత వచ్చిన సాక్సా ఫోన్ సౌండ్ బిట్ అండ్ మొదటి చరణం తర్వాత అకౌస్టిక్ డ్రమ్ సెట్స్ తో ఫాస్ట్ గా కంపోజ్ చేసిన మ్యూజిక్ బిట్స్ సూపర్బ్ గా అనిపిస్తాయి. ఓవరాల్ గా కాస్త మెలోడీ టచ్ ఉన్న ఈ సాంగ్ కూడా వినగానే బాగా నచ్చుతుంది.

 

033. పాట : డోంట్ స్టాప్
గాయకుడు : రఘు దీక్షిత్
సాహిత్యం : చంద్రబోస్

ఈ ఆల్బంలో వచ్చే మరో సోలో సాంగ్ డోంట్ స్టాప్.. హీరో తన టీంకి స్పూర్తిని ఇచ్చే పాటగా దీన్ని చెప్పుకోవచ్చు. హై సౌండ్ డ్రమ్స్ తో ఈ సాంగ్ ని స్టార్ చేయడమే ఈ సాంగ్ కి ఊపు తెస్తుంది. చాలా బలమైన పదాలతో చంద్రబోస్ రాసిన ఈ పాట చాలా మందికి స్పూర్తినిస్తుంది. ముఖ్యంగా చరణాలు చాలా బాగున్నాయి. రఘు దీక్షత్ పాడిన విధానం, ఆ వాయిస్ సాంగ్ ని మళ్ళీ వినేలా చేస్తుంది. దేవీశ్రీ ప్రసాద్ పాప్ సాంగ్ స్టైల్ లో కెట్టెల్ డ్రమ్, వెస్ట్రన్ డ్రమ్స్, మరకస్ సౌండింగ్ తో పాటు మధ్య మధ్యలో ఎలక్ట్రిక్ గిటార్ మరియు ఫ్లూట్ ని వాయించిన విధానం సూపర్బ్ అనిపిస్తుంది. మొదటిసారి యావరేజ్ అనిపించినా దేవీశ్రీ సౌండింగ్ మరియు రఘు దీక్షత్ వాయిస్ వలన వినగా వినగా ఈ సాంగ్ కి అడిక్ట్ అవుతారు.

 

4. పాట : లవ్ మీ అగైన్04
గాయకుడు : సూరజ్ సంతోష్
సాహిత్యం : చంద్రబోస్

లవ్ మీ అగైన్ అంటూ సాగే ఈ పాటని పాస్ట్ బీట్ విరహ గీతంగా చెప్పుకోవచ్చు. ఓ సమస్య వలన తను నుంచి దూరమైన ప్రేయసి ప్రేమ కోసం హీరో పాడే పాటే ఇది. ఆ భావాన్ని చాలా పర్ఫెక్ట్ గా వచ్చేలా చంద్రబోస్ సాహిత్యం అందించాడు. అలాగే ఈ పాటలోని బాధని సూరజ్ సంతోష్ తన వాయిస్ లో బాగా పలికించాడు. అందుకే వింటున్నప్పుడు ఈ పాటలోని ఫీల్ అందరికీ రీచ్ అవుతుంది. ఇకపోతే దేవీశ్రీ ప్రసాద్ ఫాస్ట్ బీట్స్, వయోలిన్ మరియు పెర్క్యూషణ్ వాయిద్యాలతో పాటకి సింక్ అయ్యేలా మ్యూజిక్ ఇచ్చాడు. ఈ పాత చాలా వరకూ ‘1-నేనొక్కడినే’లోని సయోనర సాంగ్ ని గుర్తు చేస్తుంది. అదే కాక ఆ పాటని పాదినే పిచ్ లోనే ఉండడం, అదే సింగర్ పాడడం వలన ఈ సాంగ్ లో ఆ ఫీల్ ఎక్కువ వినిపిస్తుంది. వినగా వినగా బాగా అనిపించే ఈ పాటకి ఎన్.టి.ఆర్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ వలన ఆన్ స్క్రీన్ బాగా ఉంటుందని ఆశించవచ్చు.

 

055. పాట : లవ్ దెబ్బ
గాయనీ గాయకులూ : దీపక్, శ్రావణ భార్గవి
సాహిత్యం : చంద్రబోస్

దేవీశ్రీ ప్రసాద్ ఆల్బంలో 98% ఓ మాస్ సాంగ్ ఉంటుంది. అలా నాన్నకు ప్రేమతో ఆల్బంలో వచ్చే మాస్ బీట్ పాటే ‘లవ్ దెబ్బ’. ముందు ప్రేక్షకులను ఆకట్టుకునేలా చంద్రబోస్ రాసిన సాహిత్యం పరవాలేదని పిస్తుంది. దీపక్, శ్రావణ భార్గవిల వాయిస్ ఈ మాస్ మసాలా సాంగ్ కి బాగా సింక్ అయ్యింది. ఇక దేవీశ్రీ తన మార్క్ లో పెర్క్యూషణ్ వాయిద్యాలను ఉపయోగించి ఈ పాటని సింపుల్ గా కంపోజ్ చేసేసాడు. ఈ పాత విజువల్ గా మాస్ అంతా స్టెప్స్ వేసేలా ఉంటుందని ఆశించవచ్చు.

తీర్పు :
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన గత 4 సినిమాల కంటే చాలా డిఫరెంట్ గా అనిపించే మ్యూజిక్ ఆల్బం ‘నాన్నకు ప్రేమతో’. సుకుమార్ సినిమాని, ఎన్.టి.ఆర్ ని ఎంత డిఫరెంట్ గా సినిమాలో చూపించనున్నాడో అంతే డిఫరెంట్ సాంగ్స్ దేవీశ్రీ ని తీసుకున్నాడు. సాంగ్ ట్యూన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నా లిరిక్స్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటాయి. మా ప్రకారం నాన్నకు ప్రేమతో ఆల్బంలోని బెస్ట్ 3 సాంగ్స్ అంటే ‘ఫాలో ఫాలో’, ‘నా మనస్సు నీలో’ మరియు ‘డోంట్ స్టాప్’. ఈ మూడు పాటలనే ఇన్స్‌టంట్ హిట్స్‌గా చెప్పుకోవచ్చు. మిగతా రెండు సాంగ్ యావరేజ్ గా అనిపిస్తాయి. ఫైనల్ గా చెప్పాలంటే చాలా డిఫరెంట్ ట్యూన్స్ కి విలువైన సాహిత్యాన్ని కలిపి అందించిన మ్యూజిక్ ఆల్బమ్ ‘నాన్నకు ప్రేమతో’.

రాఘవ

Click here for Audio Review in English

సంబంధిత సమాచారం

తాజా వార్తలు