సమీక్ష : “బింబిసార” – థ్రిల్ చేసే టైం ట్రావెల్ విజువల్ డ్రామా

సమీక్ష : “బింబిసార” – థ్రిల్ చేసే టైం ట్రావెల్ విజువల్ డ్రామా

Published on Aug 6, 2022 3:01 AM IST
Bimbisara Movie Review

విడుదల తేదీ : ఆగష్టు 29, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, కేథరిన్ త్రెసా, సంయుక్త మీనన్, వారినా హుస్సేన్.

దర్శకత్వం : మల్లిడి వశిష్ట్

నిర్మాత: హరికృష్ణ కె

సంగీత దర్శకుడు: ఎం ఎం కీరవాణి, చిరంతన్ భట్

సినిమాటోగ్రఫీ: ఛోటా కె. నాయుడు

ఎడిటర్: తమ్మి రాజు

గత కొన్నాళ్ల నుంచి టాలీవుడ్ లో ఎలాంటి పరిస్థితి నెలకొందో చూస్తున్నాము. దీనితో డెఫినెట్ గా ఒక సాలిడ్ హిట్ పడాలని అంతా చూస్తున్నారు. మరి ఈ క్రమంలో భారీ అంచనాలతో ఈ వారం రిలీజ్ కి వచ్చిన చిత్రమే “బింబిసార”. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా దర్శకుడు వశిష్ట్ తో చేసిన ఒక యూనిక్ కాన్సెప్ట్ తో కూడా ఫాంటసీ చిత్రం ఇది. మరి ఈ చిత్రం అంచనాలు అందుకుందా లేదా అనేది సమీక్షలో చూద్దాం రండి.

 

కథ :

ఇక కథలోకి వచ్చినట్టు అయితే.. బింబిసారుడు(కళ్యాణ్ రామ్) త్రిగర్తల సామ్రాజ్యాన్ని క్రీస్తు పూర్వం 500 ఏళ్లకు ముందు అత్యంత క్రూరంగా పాలిస్తుంటాడు. ఎలాంటి జాలి, దయ లేకుండా తనకి కావాల్సిన దానిని సొంతం చేసుకునే క్రమంలో బింబి అనుకోని శాపానికి గురవుతాడు. దీనితో అక్కడ నుంచి ప్రస్తుత కాలానికి వస్తాడు. మరి గతం నుంచి ఈ ఆధునిక యుగానికి వచ్చిన బింబిసారుడికి ఎదురైన సవాళ్లు ఏంటి? తనకి కలిగిన శాపం ఏంటి? చివరికి మళ్ళీ తాను తన కాలానికి శాశ్వతంగా వెళతాడా లేక ఇదే ఆధునిక ప్రపంచంలో ఉండిపోతాడా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో మొట్టమొదటి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సినిమా దర్శకుడు వశిష్ట్ అనే చెప్పాలి. ఈ యంగ్ దర్శకుడు తన మొదటి సినిమాకే అందులో ఇండియన్ సినిమా దగ్గర అతి తక్కువ టచ్ చేసిన టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని అందులోని హిస్టారికల్ మరియు ప్రస్తుత కాలానికి లింక్ పెట్టి అద్భుతంగా హ్యాండిల్ చేసి ఆడియెన్స్ ని డెఫినెట్ గా మెప్పిస్తాడు. ఈ విషయంలో డైరెక్టర్ ని మెచ్చుకొని తీరాలి.

ఇక మరో స్యూర్ షాట్ ప్లస్, సినిమాకి మెయిన్ పిల్లర్ నందమూరి కళ్యాణ్ రామ్ అని చెప్పాలి. ఈ తరహా పాత్రలు నందమూరి హీరోలకి ఎందుకు అంత బాగా సెట్టవుతాయి అనేది బింబిసార తో మళ్ళీ ప్రూవ్ అయ్యింది. ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ చేసిన ఎన్నో పాత్రలు ఒకెత్తు అయితే ఈ సినిమా మాత్రం ఇంకో ఎత్తు అని చెప్పాలి. మళ్ళీ తన కెరీర్ లో ఈ రేంజ్ గ్రాఫ్ మరియు షేడ్స్ ఉన్న రోల్ దొరుకుతుంది అని చెప్పడం కష్టం, మరి అలాంటి దాన్ని కళ్యాణ్ రామ్ తనదైన నటనతో ఎమోషన్స్ తో అత్యద్భుతంగా రక్తి కట్టించాడు.

పలు ఎమోషన్స్ గాని తన డాషింగ్ లుక్ ముఖ్యంగా బింబిసార గా తన డైలాగ్ డెలివరీ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయి. ఇది తన కెరీర్ లో ఒక ఐకానిక్ రోల్ అని చెప్పొచ్చు. ఇంకా ఇతర నటీనటులు క్యాథరిన్, సంయుక్త, శ్రీనివాస రెడ్డి ప్రకాష్ రాజ్ తదితర నటులు తమ పాత్రల్లో అద్భుతంగా చేశారు. ఇంకా సినిమాలో నటీనటుల పెర్ఫామెన్స్ లు పక్కన పెడితే సినిమా గ్రాండ్ స్కేల్ ఆశ్చర్యపరుస్తుంది.

మేకర్స్ భారీ మొత్తంలో పెట్టిన ఖర్చు దానికి న్యాయం ఈ విజువల్స్ లో కనిపిస్తుంది. ఇక ఈ విజువల్స్, యాక్షన్ సీన్స్ కి కనపడకుండా వేరే లెవెల్లో లేపేది సంగీతం. లెజెండరీ సంగీత దర్శకుడు కీరవాణి ఫెంటాస్టిక్ జాబ్ అందించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద ప్లస్. ఇంకా మరికొన్ని థ్రిల్లింగ్ అంశాలు పలు ట్విస్ట్ లు ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేస్తాయి.

 

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో కాస్త బాగా కనిపించే మైనస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే ఓ సరైన విలన్ పాత్ర అంత ఇంటెన్స్ గా కనిపించకపోవడం అని చెప్పాలి. అలాగే సెకండాఫ్ లో కొంచెం సినిమా అక్కడక్కడా నెమ్మదించినట్టు అనిపిస్తుంది. అలాగే కళ్యాణ్ రామ్ పాత్రని పలు సందర్భాల్లో మరింత డ్రామా క్రియేట్ చేయడానికి స్కోప్ ఉంది కానీ అది మిస్సయ్యింది.

అలాగే హీరోయిన్స్ కి కూడా పెద్దగా స్కోప్ ఉన్నట్టు కనిపించదు. ఏదో కొన్ని సీన్స్ లో ఉండాలి అన్నట్టు ఉంటారు, ముఖ్యంగా సంయుక్త మీనన్ రోల్ అయితే అంత ఎఫెక్టీవ్ గా కనిపించదు, కొన్ని సన్నివేశాలు కాస్త ఊహించదగేలానే అనిపిస్తాయి.

 

సాంకేతిక వర్గం :

మొదట చెప్పుకున్నట్టుగానే మేకర్స్ తాము ఎలా అయితే కథని నమ్మి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో అందులో ఏ ఒక్క పైసా కూడా ఈ సినిమాకి వృధా కాలేదు. ముఖ్యంగా విజువల్స్ సినిమాలో చాలా గ్రాండియర్ గా ఆకట్టుకుంటాయి. ఈ విషయంలో వి ఎఫ్ ఎక్స్ టీం ఎఫర్ట్స్ సూపర్బ్. ఇక వీటితో పాటుగా కీరవాణి సంగీతం, స్కోర్ కోసం కూడా ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. చిరంతన్ భట్ అందించిన పాటలు బాగున్నాయి.

ఇంకా చోటా కే నాయుడు తన సినిమాటోగ్రఫీ సీనియార్టీ తో అద్భుతమైన విజువల్స్ ని చూపించారు. కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ డైరెక్షన్ టీం వర్క్ బాగుంది. అలాగే డైలాగ్స్ అందించిన వాసుదేవ్ మునెప్పగరి సాలిడ్ వర్క్ అందించారు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ పలికించిన డైలాగ్స్ బాగున్నాయి. ఇంకా ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ కూడా ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లీన్ గా ఉంది.

ఇక ఫైనల్ గా దర్శకుడు వశిష్ట్ తన డెబ్యూ చిత్రంతోనే తన సత్తా ప్రూవ్ చేసుకున్నాడు. సినిమాని గత ఏడాదిలో షాకింగ్ గా అనౌన్స్ చేసినప్పుడే ఈ కథ చాలా ఆసక్తి రేపింది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ ని టైం ట్రావెల్ అనే యూనిక్ పాయింట్ తో ఎలా చూపిస్తారా అనేది ఎగ్జైటింగ్ గా అనిపించింది. మరి దీన్నైతే తాను చాలా మెచ్యూర్ గా సాలిడ్ ఎమోషన్స్ లాజిక్స్ తో ఎస్టాబ్లిష్ చేసి ఆడియెన్స్ కి భారీ విజువల్ ట్రీట్ ని అందించాడు. దీనితో అయితే అందరి అంచనాలు తాను డెఫినెట్ గా అందుకుంటాడని చెప్పొచ్చు.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “బింబిసార” తో ఒక్క చిత్ర యూనిట్ కోరుకున్న విజయంతో పాటుగా టాలీవుడ్ కూడా అత్యవసరంగా ఎదురు చూస్తున్న హిట్ దొరికేసినట్టే అని చెప్పాలి. నందమూరి కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం, సినిమాలోని విజువల్స్, సంగీతం ఇలా అన్నిటినీ మించి దర్శకుడు వశిస్థ్ సిన్సియర్ ఎఫర్ట్స్ ఆడియెన్స్ ని ఒక కొత్త లోకానికి తీసుకెళ్తాయి. ఈ వారాంతానికి అయితే ఖచ్చితంగా ఫ్యామిలీ తో అంతా కలిసి చూసేందుకు సాలిడ్ ట్రీట్ ని ఈ చిత్రం ఇస్తుంది. మిస్సవ్వొద్దు..

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు