లాక్ డౌన్ రివ్యూస్: జమ్తారా హిందీ వెబ్ సిరీస్ (నెట్ ఫ్లిక్స్)

లాక్ డౌన్ రివ్యూస్: జమ్తారా హిందీ వెబ్ సిరీస్ (నెట్ ఫ్లిక్స్)

Published on Apr 27, 2020 1:11 PM IST

మన లాక్ డౌన్ రివ్యూస్ లో నెక్స్ట్ వెబ్ సిరీస్ జమ్తార. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. అక్ష పార్ధసాని ప్రధాన పాత్రలో నటించగా సౌమేంద్ర పధి డైరెక్ట్ చేసిన ఈ హిందీ వెబ్ సిరీస్ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం కథాంశం ఏమిటీ?

ఐపిఎస్ అధికారి డాలీ సాహు (అక్ష పర్దాసాని), అక్రమ కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిన ఒక చిన్న గ్రామమైన జమ్తారాకు బదిలీ చేయబడుతుంది.నకిలీ బ్యాంక్ కాల్స్ చేస్తూ అమాయకుల డబ్బులు దోచుకొనే ఓ యువకుల ముఠా అక్కడ ఉంటుంది. జమ్తారాకు వచ్చిన డాలీ ఆ ఫేక్ బ్యాంకు కాల్స్ ముఠా వెనుక రాజకీయంగా బలమైన మంత్రి (అమిత్ సియాల్)ఉన్నాడని తెలుసుకుంటుంది. మరి జమ్తారా గ్రామంలో గ్యాంగ్ ల కథ డాలీ ఎలా ముగించింది అనేది అసలు కథ.

ఏమి బాగుంది?:

అనేక తెలుగు సినిమాలో నటించిన అక్షర పార్ధసారథి పోలీస్ గా ఉత్తమ నటన కనబరిచింది. ఓ మారుమూల గ్రామాన్ని వేదికగా చేసుకొని నేరాలకు పాల్పడే యువకులుగా నటించిన నటులు పాత్రలకు తగ్గట్టుగా చాలా సహజంగా నటించారు. ఫేక్ కాల్స్ ద్వారా ఎలా అమాయకులను బురిడీ కొట్టించి వారి సొమ్ము కాజేయ వచ్చు, అమాయకులైన ఆడ పిల్లలను తమ నేరాల కోసం ఎలా వాడుకుంటున్నారు అనే విషయాలు చాలా చక్కగా చెప్పారు. ఇక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు కూడా ఆహ్లాదం కలిగించాయి.

చివరి మాట:

మొత్తంగా చెప్పాలంటే వాస్తవానికి దగ్గరగా ఆసక్తికరమైన క్రైమ్ సన్నివేశాలతో సాగిన జమ్తారా ఆకట్టుకుంటుంది. ఐతే సాగతీతకు గురైన మధ్యలో ఎపిసోడ్స్ తో పాటు, ఒక వర్గానికి అర్థం కానీ లాంగ్వేజ్ వంటి ప్రతి కూలతలు లేకుంటే ఈ వెబ్ సిరీస్ మరో స్థాయిలో ఉండేది.

123telugu.com Rating : 3/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు