లాక్ డౌన్ రివ్యూ : ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’ – తెలుగు వెబ్ సిరీస్ (జీ5)

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి సమీక్షగా వచ్చిన వెబ్ సిరీస్.. తెలుగు వెబ్ సిరీస్ ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’. ఈ వెబ్ ధారావాహికకు అనీష్ కురువిల్లా దర్శకత్వం వహించారు. సత్యదేవ్, ఎల్బీ శ్రీరామ్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది అక్టోబర్ 29న విడుదలైంది. కాగా వైవిధ్యమైన వెబ్‌ సిరీస్‌లను అందిస్తూ ప్రేక్షకులను మైమరిపిస్తున్న జీ5 వారు ఈ వెబ్‌ సిరీస్‌ ని అందించారు.

 

కథా నేపథ్యం :

కడపకు చెందిన ప్రతాప్ రెడ్డి మైనింగ్ లేబర్ గా పనిచేయడానికి తన భార్య, పిల్లలతో కలిసి ధర్మపురికి వస్తాడు. ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం ప్రతాప్ రెడ్డి అనేక ప్రాణాంతక సంఘటనలను ధైర్యంగా ఎదుర్కొంటాడు. అక్కడి భూస్వామ్య డి ఎన్ రెడ్డిని అడ్డు తొలిగించి.. ప్రతాప్ రెడ్డి అక్కడ కీలకంగా మారతాడు. ఆ తరువాత జరిగిన కాలం జరిగేకొద్ది ప్రతాప్ రెడ్డి ఇద్దరు కుమారులు తమ సొంత వ్యూహాలతో సమస్యలతో ధర్మపురిలోనే ఉద్రిక్తతమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. పవర్ మరియు అసూయ మధ్య జరిగే సంఘర్షణలో వారి జీవన ప్రయాణం ఎలా సాగుతుంది ? చివరికీ వారికి ఏమి జరుగుతుంది అనేది మిగిలిన కథ.

 

ఏం బాగుంది :

సత్యదేవ్ తన సంక్లిష్ట పాత్రలో ఎప్పటిలాగే అద్భుతంగా నటించాడు. తన నటనా సామర్థ్యంతో కొన్ని చోట్ల ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. చాందిని చౌదరి అందంగా కనిపించి ఆకట్ట్టుకుంది. ఇక సీనియర్ నటుడు ఎల్బీ శ్రీరామ్ తన నెగటివ్ రోల్ లో చాలా బాగా నటించారు.

నిజానికి ఇలాంటి క్యారెక్టర్ లో ఆయన్ని ఉహించుకోలేము. ఇక కొన్ని డైలాగ్స్ కూడా చాల బాగున్నాయి. అలాగే సినిమాలో మెయిన్ గా ప్రదర్శించిన సంఘర్షణ పాయింట్ కూడా బాగుంది. ఇక ప్రారంభ సన్నివేశాలు కథలోకి చాల బాగా తీసుకువెళ్తాయి. అలాగే చివరి ఐదు ఎపిసోడ్లలో మంచి డ్రామాతో పాటు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంది.

 

చివరి మాటగా :

మొత్తంమీద, గాడ్స్ ఆఫ్ ధర్మపురి ఒక బలమైన నేపథ్యంతో పాటు మంచి నటీనటులతో నిర్మించిన వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ లో ధర్మపురి ప్రపంచంతో పాటు అక్కడి యాస భాషల ప్రదర్శనలు మరియు ఆసక్తికర కథనం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. అయితే కొన్ని చోట్ల స్లోగా సాగిన ఫీలింగ్ వస్తోంది. అయినప్పటికీ తీవ్రమైన డ్రామాను ఇష్టపడే వారైతే ఈ లాక్ డౌన్ సమయంలో ఈ వెబ్ సిరీస్ ను సరదాగా చూడొచ్చు.

123telugu.com Rating : 3/5

సంబంధిత సమాచారం :

More