లాక్ డౌన్ రివ్యూ : గిల్టీ – హిందీ సినిమా (నెట్‌ఫ్లిక్స్)

నిర్మాతలు : కరణ్ జోహార్, అనీషా బేగ్
నటీనటులు: కియారా అద్వానీ, ఆకాన్షా రంజన్ కపూర్, గుర్ఫతే సింగ్ తదితరులు
డైరెక్టర్ : రుచి నారెయిన్

ఈ లాక్ డౌన్ సమయంలో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లను సమీక్షించే శ్రేణిని కొనసాగిస్తూ.. నేటి సినిమా వచ్చిన సినిమా ‘గిల్టీ’. రుచి నారెయిన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ‘నెట్ ఫ్లిక్స్’లో అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

 

కథా నేపథ్యం :

మీ టూ ఉద్యమం అంశం పై ఈ చిత్రం ప్రధానంగా సాగుతుంది. 2018 వాలెంటైన్స్ డే రాత్రి తన బాయ్ ఫ్రెండ్ వి.జె (గుర్ఫతే సింగ్ పిర్జాడా) తన పై అత్యాచారం చేశాడని విశ్వవిద్యాలయంలోని ఒక కొత్త విద్యార్థి ఆరోపిస్తుంది. నాంకి దత్తా (కియారా అద్వానీ)కి తనూ కుమార్ (ఆకాన్షా రంజన్ కపూర్)కు ఈ విషయం చాలెంజ్ గా మారుతుంది. ఈ క్రమంలో జరిగే కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ఈ కేసు విషయంలో నాంకి దత్తా ఏం చేస్తోంది ? అసలు వాలెంటైన్స్ డే రాత్రి ఏం జరిగింది ? నాంకి దత్తా ఈ కేసును ఎలా చెదిస్తోంది అనేది మిగతా కథ.

 

ఏం బాగుంది :

ఈ చిత్రంలో కియారా అద్వానీ ‘నాంకి దత్తా’ పాత్రలో చాల బాగుంది. తనను తాను మార్చుకుని చాల బాగా నటించింది. ముఖ్యంగా కేసును దర్యాప్తు ప్రారంభించే సీన్స్ లో ఆమె నటన బాగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం స్క్రీన్ ప్లే కూడా ఫ్లాష్ బ్యాక్ స్టైల్ లో ప్లే అవుతూ ఇంట్రస్ట్ గా సాగుతుంది. మెయిన్ గా కొన్ని సీన్స్ చాల బాగున్నాయి. ఇక మీ టూ ఉద్యమం నేపథ్యంతో ఈ చిత్రం రావడం, ఈ చిత్రంలో బిజియమ్, విజువల్స్ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి.

 

ఏం బాగాలేదు :

ఈ చిత్రం మంచి ఇంట్రస్ట్ తో ప్రారంభమైనా.. మొదటి అరగంట వరకు ప్లే బాగున్నా, ఆ తరువాత నుండి, వచ్చే సన్నివేశాలు బాగాలేవు. పైగా ఈ చిత్రంలో సంఘర్షణకి మంచి స్కోప్ ఉన్నా, అనవసరమైన బోర్ సీన్స్ తో ట్రీట్మెంట్ రాసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తోంది. పైగా క్లైమాక్స్ కూడా చాల స్లోగా సాగుతుంది. కథను లాగకుండా, సెకెండ్ హాఫ్ ను ఇంకా కొత్తగా ప్రదర్శించి ఉంటే బాగుండేది. కియారా బాగా నటించినప్పటికీ, ఆమె పాత్రను ఇంకా బాగా మలిచి ఉండాల్సింది.

 

చివరి మాటగా :

మొత్తంమీద, సమకాలీన అంశాల పై వచ్చిన ఈ గిల్టీ చిత్రం పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఒక సాధారణ కథను సరైన మోటివ్ లేకుండా సాగదీయడం బాగాలేదు. అయితే నిర్మాణ విలువలు మరియు కియారా అద్వానీ నటన ఆకట్టుకుంటాయి. ఈ లాక్ డౌన్ లో సగటు సినిమా కంటే తక్కువ స్థాయిలోనే ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుంది.

సంబంధిత సమాచారం :

More