లాక్ డౌన్ రివ్యూ: యారా- హిందీ ఫిల్మ్(జీ)

లాక్ డౌన్ రివ్యూ: యారా- హిందీ ఫిల్మ్(జీ)

Published on Aug 6, 2020 6:05 PM IST

 

నటీనటులు : విద్యుత్ జమ్వాల్, శ్రుతి హాసన్, అమిత్ సాధ్, విజయ్ వర్మ

దర్శకత్వం : టిగ్మాన్షు ధులియా

నిర్మించినవారు : టిగ్‌మన్‌షు ధులియా, సునీర్ ఖేటర్‌పాల్

సంగీతం : గౌరోవ్-రోషిన్, షాన్, అంకిత్ తివారీ, సిద్ధార్థ్ పండిట్

ఛాయాగ్రహణం : రిషి పంజాబీ

ఎడిట్ చేసినవారు : గీతా సింగ్

 

లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు హిందీ మూవీ యారా ని ఎంచుకోవడం జరిగింది. జీ 5 లో అందుబాటులో ఉన్న ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం ..

 

కథాంశం ఏమిటీ?

స్నేహితులైన ఫగున్ (విద్యుత్ జమ్వాల్), మిత్వా (అమిత్ సాధ్), రిజ్వాన్ (విజయ్ వర్మ), మరియు బహదూర్ (కెన్నీ బసుమాటరి) కరుడు కట్టిన నేరస్థులు. ఢిల్లీకి చెందిన ఓ మాఫియా డాన్ క్రింద పనిచేస్తూ ఉంటారు. నక్సల్ భావాలు కలిగిన సుగన్యా (శ్రుతి హాసన్) తో ఫగన్ పరిచయం తరువాత పరిస్థితులు మారిపోతాయి. ఈ నలుగురు మితృలు కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి బయటికి వస్తారు. జైలు నుండి బయటికి వచ్చిన ఈ నలుగురు మిత్రుల మధ్య నడిచి సందిగ్ధం ఏమిటీ అనేది మిగతా కథ.

 

ఏమి బాగుంది?

హీరోగా చేసిన విద్యుత్ జమ్వాల్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో ఆయన బాగా ఆకట్టుకున్నారు. హీరోయిన్ గా చేసిన శ్రుతీ హాసన్ పాత్రకు పెద్దగా నిడివి లేదు. ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది. ఇక కథలో కీలక పాత్రలు చేసిన అమిత్ సాధ్, విజయ్ వర్మ, కెన్నీ ఆకట్టుకున్నారు.

క్రైమ్ సన్నివేశాలు బాగున్నాయి. నలుగురు మిత్రుల చిన్ననాటి సన్నివేశాలు, వారి క్రైమ్ సన్నీ వేశాలు ఆకట్టుకున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. బీజీఎమ్ మరియు కెమెరా వర్క్ ఆకట్టుకుంది.

 

ఏమి బాగోలేదు?

2011లో వచ్చిన ఓ ఫెంచ్ మూవీ ప్రేరణతో వచ్చిన ఈ మూవీ పూర్తిగా గతి తప్పింది. ఆ మూవీ దరిదాపులలోకి కూడా మూవీ వెళ్లలేక పోయింది. అద్బుత నటులు ఉండి కూడా దర్శకుడు మ్యాజిక్ చేయలేక పోయాడు.

పాత్రలు మధ్య సరైన సంఘర్ణణ, బాండింగ్ కుదరలేదు. పాత్రలు ఎమోషనల్ గా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేకపోయాయి. ఇక శృతి హాసన్ పాత్ర కొన్ని సన్నివేశాలకే పరిమితం చేశారు.

ఇక మూవీలో అనేక సన్నివేశాలు లాజిక్ మిస్సయింది. ఇక క్లైమాక్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదు.

 

చివరి మాటగా

విద్యుత్ నటన, అక్కడక్కడా అలరించే యాక్షన్ సన్నివేశాలు మినహాయిస్తే ఈ మూవీలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. లాజిక్ లేని సన్నివేశాలు, ఎమోషనల్ బాండింగ్ లేని పాత్రలు ప్రేక్షకుడికి అనుభూతిని పంచలేకపోయాయి. మొత్తంగా ఈ మూవీ నిరాశపరుస్తుంది అని చెప్పొచ్చు.

Rating: 2/5

సంబంధిత సమాచారం

తాజా వార్తలు